Share News

ఖు‘షీ’గా..

ABN , Publish Date - Aug 15 , 2026 | 02:54 AM

ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్‌ సిక్స్‌ పథకాల్లో ఒకటైన స్త్రీ శక్తి జిల్లాలో విజయవంతంగా ముందుకు సాగుతోంది. గతంలో అంతంతమాత్రంగా ఉన్న మహిళా ప్రయాణికుల సంఖ్య ఇప్పుడు రెట్టింపు అయ్యింది.

ఖు‘షీ’గా..
ఆర్టీసీ బస్సులో ఆధార్‌ కార్డులతో ప్రయాణిస్తున్న మహిళలు

అనూహ్య ఆదరణతో ఏడాది పూర్తి చేసుకున్న ‘స్త్రీశకి’్త

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పురుషుల కన్నా మహిళా ప్రయాణికులే అధికం

35 నుంచి 56.96శాతానికి పెరిగిన ఓఆర్‌

ఏడాదిలో 4.43 కోట్ల మంది స్ర్తీలకు లబ్ధి

ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్‌ సిక్స్‌ పథకాల్లో ఒకటైన స్త్రీ శక్తి జిల్లాలో విజయవంతంగా ముందుకు సాగుతోంది. గతంలో అంతంతమాత్రంగా ఉన్న మహిళా ప్రయాణికుల సంఖ్య ఇప్పుడు రెట్టింపు అయ్యింది. రీజియన్‌ పరిఽధిలో గత ఆగస్టు 15 నుంచి ఇప్పటి వరకూ ఏడాదిలో 4.43 కోట్ల మంది మహిళలు ప్రయాణించారు. రోజుకు సుమారు లక్ష మంది ప్రయాణిస్తున్నట్లు అంచనా. రీజియన్‌ పరిధిలో రోజుకు 2.3 లక్ష కిలోమీటర్లు అన్ని బస్సులు నడపగా, కేవలం స్త్రీశక్తికి కేటాయించిన బస్సులే 1.30 లక్షల కిలోమీటర్లు ప్రయాణించినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఈ ఏడాది కాలంలో మహిళలకు ఉచిత ప్రయాణం కోసం రూ.168.41 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తుండటంతో సూపర్‌ సిక్స్‌లో ఒకటైన హామీ ‘స్త్రీ శక్తి’ జిల్లాలో అనూహ్య ఆదరణతో దూసుకెళ్తోంది.

ఒంగోలు కార్పొరేషన్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి) : ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం (స్ర్తీశక్తి) ప్రారంభమై శనివారానికి ఏడాది అవుతోంది. జిల్లాలో మొత్తం 485 ఆర్టీసీ బస్సులు నడుపుతుండగా, అందులో 421 ‘స్త్రీ శక్తి’కి కేటాయించారు. దీంతో పల్లె వెలుగు, ఆలా్ట్ర పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌బస్సులకు మరింత డిమాండ్‌ ఏర్పడింది. రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రభుత్వం ప్రకటించడంతో ఆదరణ పెరిగింది. గతంతో పోల్చుకుంటే ఈ ఏడాదిలో మహిళా ప్రయాణికుల సంఖ్య రెట్టింపు అయింది. గతంలో 35 శాతం మంది మాత్రమే స్ర్తీలు, 65 శాతం పురుషులు ఆర్టీసీలో ప్రయాణించేవారు. స్ర్తీశక్తి పథకం అమలు తరువాత గణాంకాలను పరిశీలిస్తే మహిళాప్రయాణికుల శాతం 56.96శాతానికి చేరింది.

4.43 కోట్ల మంది మహిళలకు లబ్ధి

ప్రకాశం రీజియన్‌ పరిధిలో ఒంగోలు, మార్కాపురం, కనిగిరి, గిద్ద లూరు, పొదిలి, అద్దంకి ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. 866 గ్రామాలకు అనుసంధానంగా 20 బస్‌ స్టేషన్లు ఉన్నాయి. వాటిపరిధిలో 484 ఆర్టీసీ బస్సులు ఉండగా వాటిలో 95 అద్దె ప్రాతిపదికన (హయ్యర్‌) నడుస్తున్నాయి. ఇవన్నీ రోజుకు 2లక్షల కిలోమీటర్లు ప్రయాణికుల కోసం రాకపోకలు సాగిస్తున్నాయి. అందులో 1.5 లక్షల మంది ప్రయాణి స్తున్నారు. ఇంతకుముందు ప్రకాశం రీజియన్‌కు రోజుకు రూ.77.51 లక్షల ఆదాయం చొప్పున నెలకు రూ.23.25 కోట్లు వచ్చేది. స్ర్తీశక్తి పథకం అమల్లోకి వచ్చిన తరువాత నెలకు రూ.37.33 కోట్ల మేర ఆర్టీసీకి సమకూరుతోంది. ఆక్యుపెన్సీ రేషియో పెరగడంతో ఆదాయం నెలకు రూ.14 లక్షలకుపైన పెరిగింది.

Updated Date - Aug 15 , 2026 | 02:54 AM