బాధితులకు చెక్కుల అందజేత
ABN , Publish Date - May 19 , 2026 | 11:24 PM
మార్చి 26న మార్కాపురం జిల్లా రాయవరం వద్ద జరిగిన ఘోరరోడ్డు ప్రమదంలో మృతి చెందిన, గాయపడిన వారికి ప్రభుత్వం తరుపున ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి స్వయంగా ఇంటికి వెళ్లి చెక్కులను అందజేశారు.
కొనకనమిట్ల, మే 19 (ఆంధ్రజ్యోతి) : మార్చి 26న మార్కాపురం జిల్లా రాయవరం వద్ద జరిగిన ఘోరరోడ్డు ప్రమదంలో మృతి చెందిన, గాయపడిన వారికి ప్రభుత్వం తరుపున ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి స్వయంగా ఇంటికి వెళ్లి చెక్కులను అందజేశారు. కొనకనమిట్ల మండలం పెదారికట్ల గ్రామంలో మృతి చెందిన అంబటి అనిల్, లియో మృతి చెందారు. అదే ప్రమాదంలో గాయడిన అంబటి సౌధాకు కలిపి రూ.12లక్షలు చెక్కును అందజేశారు. చింతగుంట గ్రామానికి చెందిన వెలుగోటి గురవయ్య గాయపడగా రూ.2లక్షల చెక్కును అందించారు. అనంతరం బురదపాలెం, ఎదురాళ్లపాడు గ్రామాలలో టీడీపీ కార్యక్తలతో సమావేశం నిర్వహించారు.