సెక్టోరల్ పోస్టుల భర్తీ నిలిపివేత
ABN , Publish Date - Oct 08 , 2026 | 02:35 AM
సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో ఖాళీగా ఉన్న సెక్టోరల్, అసిస్టెంట్ సెక్టోరల్ పోస్టుల భర్తీకి సంబంధించి చేపట్టిన నియామకాల ప్రక్రియ నిలిచిపోయింది. సాధారణ పరిపాలన శాఖ, పాఠశాల విద్య డైరెక్టర్ ఉత్తర్వుల నేపథ్యంలో అర్ధంతరంగా ఆగిపోయింది. ‘
విభజన తర్వాత తదుపరి కార్యాచరణ
ఒంగోలు విద్య, అక్టోబరు 7 (ఆంరఽధజ్యోతి) : సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో ఖాళీగా ఉన్న సెక్టోరల్, అసిస్టెంట్ సెక్టోరల్ పోస్టుల భర్తీకి సంబంధించి చేపట్టిన నియామకాల ప్రక్రియ నిలిచిపోయింది. సాధారణ పరిపాలన శాఖ, పాఠశాల విద్య డైరెక్టర్ ఉత్తర్వుల నేపథ్యంలో అర్ధంతరంగా ఆగిపోయింది. ‘సెక్టోరల్ పోస్టుల భర్తీ జరిగేనా’ శీర్షికన గత సోమవారం ‘ఆంరఽధజ్యోతి’లో ప్రచురితమైన కథనం అక్షరసత్యమైంది. ఈ పోస్టుల భర్తీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సమగ్ర శిక్ష అదనపు కోఆర్డినేటర్ అనిల్‌కుమార్ తెలిపారు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ఉద్యోగులు, ఉపాధ్యాయులను విభజిత జిల్లాలకు కేటాయించేందుకు వీలుగా అన్ని ప్రభుత్వ శాఖలతోపాటు పాఠశాల విద్యాశాఖలో కొత్త పోస్టుల సృష్టి, కొత్త రిక్రూట్‌మెంట్‌లు, ఉద్యోగోన్నతులు, బదిలీలు, పొరుగు సేవలు, డిప్యుటేషన్లు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అయితే సమగ్ర శిక్ష ప్రాజెక్టు కార్యాలయంలో వివిధ పోస్టుల భర్తీకి గత నెల 30న ఏపీసీ అనిల్‌కుమార్ నోటిఫి కేషన్ విడుదల చేశారు. ఈనెల 5వ తేదీలోపు దరఖాస్తులు స్వీకరించగా 37మంది చేసుకున్నారు. విద్యాశాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియా జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం నియామకాలు, బదిలీలు, ఉద్యోగోన్నతులు తదితర సర్వీసు మ్యాటర్లన్నీ నిలిచిపోయాయి. అయితే ఈ ఉత్తర్వులకు ముందే విద్యాశాఖ ఉద్యోగి ఒకరు పొరుగు సేవల కింద ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ గుంటూరు కార్యాలయానికి బదిలీ ఉత్తర్వులు తెచ్చుకోగా డీఈవో నిలిపివేశారు. అదేవిధంగా పొరుగు సేవల్లో ఉన్న ముగ్గురిని మాతృశాఖకు పంపించే మూడు పైళ్లను ఆర్‌జేడీ ఆపివేశారు. 5వతేదీ వరకు సెక్టోరల్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరించి ఇప్పుడు భర్తీ నిలిపివేశారు. ఉద్యోగుల విభజన తర్వాత తదుపరి కార్యాచరణ చేపడతామని ఏపీసీ తెలిపారు.