టీచర్ల పని సర్దుబాటుకు మార్గదర్శకాలు
ABN , Publish Date - Jun 24 , 2026 | 02:51 AM
విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రామాణికంగా పాఠశాలల్లో మిగులు టీచర్లను అవసరం ఉన్న స్కూళ్లకు సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను నిర్దేశిస్తూ పాఠశాల విద్య డైరెక్టర్ తమీమ్ అన్సారియా మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.
ఈనెల 20తేదీ నాటి విద్యార్థుల సంఖ్య ప్రామాణికం
30 నాటికి పూర్తి చేయాలని ఆదేశం
ఒంగోలు విద్య, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రామాణికంగా పాఠశాలల్లో మిగులు టీచర్లను అవసరం ఉన్న స్కూళ్లకు సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను నిర్దేశిస్తూ పాఠశాల విద్య డైరెక్టర్ తమీమ్ అన్సారియా మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈనెల 20వతేదీ నాటి విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకొని పాఠశాలల్లో మిగులు టీచర్లు, అదనపు టీచర్ల అవసరాన్ని గుర్తించాలని సూచించారు. మిగులు టీచర్ల గుర్తింపు, వారిని అవసరం ఉన్న పాఠశాలలకు సర్దుబాటు ప్రక్రియను ఈనెల 30నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తిలో కొన్ని మార్పులు చేశారు. కేవలం విద్యార్థుల సంఖ్య ప్రామాణికంగానే మిగులు టీచర్లను గుర్తించి సర్దుబాటు చేయాలన్నారు. ఈ ప్రక్రియలో తప్పులు జరిగితే సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని డైరెక్టర్ హెచ్చరించారు.