కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్‌కు గ్రీన్‌సిగ్నల్
ABN , Publish Date - Jun 04 , 2026 | 03:24 AM
జిల్లాలో మరో భారీ పరిశ్రమ స్థాపనకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తీర ప్రాంతమైన కొత్తపట్నంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి రూ.441.88 కోట్లు మంజూరు చేసింది. ఈమేరకు బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది.
రూ. 441.88 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
ఒంగోలు కార్పొరేషన్, జూన్ 3 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మరో భారీ పరిశ్రమ స్థాపనకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తీర ప్రాంతమైన కొత్తపట్నంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి రూ.441.88 కోట్లు మంజూరు చేసింది. ఈమేరకు బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ హార్బర్ ద్వారా తీరప్రాంతంలో వందలాది మందికి ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు, పర్యాటక రంగానికి మరింత ఉపయోగపడనుంది. ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుతో ఒంగోలు నియోజకర్గ పరిధిలోని కొత్తపట్నం మండలం పారిశ్రా మిక, పర్యాటకపరంగా ఎంతగానో అభివృద్ధి చెందనుంది. హార్బర్ ఏర్పాటు ద్వారా కొత్తపట్నం తీరం నుంచి మత్స్య సంపద విదేశాలకు ఎగుమతయ్యే విధంగా ప్రభుత్వం చొరవ చూపింది. ఫిషింగ్ హార్బర్‌తో తీర ప్రాంత మత్స్యకారులకు మంచి రోజులు రానున్నాయి.