38 ఆశా వర్కర్ల పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్
ABN , Publish Date - Sep 08 , 2026 | 02:45 AM
జిల్లాలో ఖాళీగా ఉన్న 38 ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 1,294 పోస్టులను భర్తీచేయగా తాజాగా 913 పోస్టులను ప్రకటించింది.
ప్రభుత్వం ఉత్తర్వులు... త్వరలో ప్రక్రియ ప్రారంభం
ఒంగోలు కలెక్టరేట్, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఖాళీగా ఉన్న 38 ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 1,294 పోస్టులను భర్తీచేయగా తాజాగా 913 పోస్టులను ప్రకటించింది. అందులో ప్రకాశం జిల్లాకు సంబంధించి 38 ఉన్నాయి. ఆశా కార్యకర్తకు నెలకు గౌరవ వేతనం రూ.10వేలు ఇవ్వనున్నారు. వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ ఆమోదం తెలపడంతో త్వరలోనే ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.