Share News

గుండెపోటుతో గ్రానైట్‌ కార్మికుడు మృతి

ABN , Publish Date - Sep 16 , 2026 | 11:14 PM

బల్లికురవ మండల పరిధిలోని మల్లాయపాలెం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఎదురుగా బుధవారం గుండెపోటుతో రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన గ్రానైట్‌ ఫ్యాక్టరీల పనులకు వచ్చిన కార్మికుడు షంబర్‌ఖాన్‌(54) మృతి చెందాడు.

గుండెపోటుతో గ్రానైట్‌   కార్మికుడు మృతి

బల్లికురవ, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి) : మండల పరిధిలోని మల్లాయపాలెం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఎదురుగా బుధవారం గుండెపోటుతో రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన గ్రానైట్‌ ఫ్యాక్టరీల పనులకు వచ్చిన కార్మికుడు షంబర్‌ఖాన్‌(54) మృతి చెందాడు. అందిన సమాచారం మేరకు... రాజస్థాన్‌కు చెందిన షంబర్‌ కార్మికుడు దివ్యాంగుడు ఫ్యాక్టరీల వద్ద చిన్నచిన్న పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం రోడ్డుపై నడిచి వెళుతుండగా మల్లాయపాలెం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్దకు రాగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలాడు. అక్కడ ఉన్న కార్మికులు వెంటనే చూసి 108 వాహనానికి సమాచారం అందించగా వారు వచ్చి చూసి గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు. తోటి కార్మికులు విరాళాలు సేకరించి మృతదేహాన్ని రాజస్థాన్‌ తరలించారు.

Updated Date - Sep 16 , 2026 | 11:14 PM