Share News

నేటి నుంచి పంచాయతీల్లో గ్రామ సభలు

ABN , Publish Date - Sep 03 , 2026 | 02:46 AM

పంచాయతీ ఎన్నికలకు సంబంధిం చిన కసరత్తు ముమ్మరమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. ఇప్పటికే ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించి అభ్యంతరాలను స్వీకరించి పరిష్క రించారు.

నేటి నుంచి పంచాయతీల్లో గ్రామ సభలు

మూడు రోజులు నిర్వహణ

7న ఎస్సీ, ఎస్టీ, బీసీ తుది ఓటర్ల జాబితా ప్రచురణ

ఒంగోలు కలెక్టరేట్‌, సెప్టెంబరు 2 (ఆంధ్ర జ్యోతి) : పంచాయతీ ఎన్నికలకు సంబంధిం చిన కసరత్తు ముమ్మరమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. ఇప్పటికే ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించి అభ్యంతరాలను స్వీకరించి పరిష్క రించారు. ప్రస్తుతం గుర్తించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల తుది జాబితాను ప్రచురించేందుకు గురువారం నుంచి ఈనెల 7వ తేదీ వరకు గ్రామ సభల నిర్వహణకు అధికారులు సిద్ధమయ్యారు. జిల్లాలో 519 పంచాయతీలు ఉండగా కొండపి మినహా మిగిలిన 518 పంచాయతీల్లో సభలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితాలపై ప్రజలతో చర్చించి అనుమతి పొందనున్నారు. ఈనెల 7వ తేదీన గ్రామ పంచాయతీల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. అనంతరం పంచాయతీరాజ్‌ కమిషనర్‌కు కలెక్టర్‌ ద్వారా వివరాలను పంపనున్నారు. కాగా ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించడంతో తదనుగుణంగా ఆ శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.

Updated Date - Sep 03 , 2026 | 02:46 AM