పాఠశాల విద్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
ABN , Publish Date - Jan 07 , 2026 | 02:42 AM
పాఠశాల విద్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. మంగళవారం మండలంలోని చందలూరులో ప్రీమియర్ ఎనర్జీస్, రోటరీ క్లబ్, అసిస్ట్ ప్రతినిధులతో కలసి మంత్రి స్థానిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు.
మంత్రి గొట్టిపాటి రవికుమార్
చందలూరులో విద్యార్థులకు ఉచితంగా సైకిళ్ల పంపిణీ
పంగులూరు, జనవరి 6 (ఆంధ్రజ్యోతి) : పాఠశాల విద్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. మంగళవారం మండలంలోని చందలూరులో ప్రీమియర్ ఎనర్జీస్, రోటరీ క్లబ్, అసిస్ట్ ప్రతినిధులతో కలసి మంత్రి స్థానిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ముద్రలు లేకుండా విద్యార్థులకు యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, బ్యాగ్, షూస్ అందజేసినట్లు చెప్పారు. అర్హత కలిగిన పిల్లలందరికీ తల్లికి వందనం కింద లబ్ధి చేకూర్చినట్లు తెలిపారు. ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేశామన్నారు. ప్రీమియర్ ఎనర్జీస్ సహకారం, రోటరీక్లబ్ తోడ్పాటు, అసిస్ట్ సంస్థ చొరవతో చందలూరు, అలవల పాడు, నూజెళ్లపళ్లి గ్రామాల్లో 560మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్లు అందజేశామన్నారు. యువతకు ఉపాధి
కల్పించేందుకు రాష్ట్రంలో పారిశ్రామిక అభివృధ్ధికి చంద్రబాబు శ్రీకారం చుట్టారన్నారు. నియోజకవర్గంలో వెయ్యి ఎకరాలలో రెనిబుల్ ఎనర్జీస్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించినట్టు చెప్పారు. ప్రీమియర్ ఎనర్జీస్ ఎండీ సోనాలి మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాలస్థాయి నుంచి చదువుపై శ్రద్ధచూపి ఉన్నతంగా ఎదగాలన్నారు. రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా రోటరీక్లబ్ విద్య, ఆరోగ్యం, సామాజిక ప్రగతికి సేవలందిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో ప్రీమియర్ ఎనర్జీస్ ప్రతినిధి సుధీర్, రోటరీ ప్రతినిధి రాజశేఖర్, ఆర్డీవో లక్ష్మీప్రసన్న, సర్పంచ్ పెంట్యాల క్రిష్ణయ్య, కేవీ సుబ్బారావు, పెంట్యాల రాధాకృష్ణ, ట్రస్ట్ చైర్మన్ వీరనారాయణ, హెచ్‌ఎం గిరిజ, రోటరీ అధ్యక్షకార్యదర్శులు వీరనారాయణ, రామారావు, జగన్ తదితరులు పాల్గొన్నారు.