Share News

ప్రజారోగ్యానికి ప్రభుత్వ ప్రాధాన్యం

ABN , Publish Date - May 24 , 2026 | 11:39 PM

ప్రజారోగ్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని టీడీపీ ఎర్రగొండపాలెం ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు.

ప్రజారోగ్యానికి ప్రభుత్వ ప్రాధాన్యం
మాట్లాడుతున్న టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు

టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు

పెద్దారవీడు, మే 24(ఆంధ్రజ్యోతి): ప్రజారోగ్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని టీడీపీ ఎర్రగొండపాలెం ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో ఆదివారం గుంటూరు శంకర కంటి వైద్యశాల, తాను సంయుక్తంగా నిర్వహిస్తున్న కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ వెనుకబడిన ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని ప్రజలకు ఉన్నత స్థాయి వైద్య సేవలను అందించాలన్న లక్ష్యంతో వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు సుదూర ప్రాంతాలలో ఉన్న ఉత్తమ సేవలను పొందేందుకు పడుతున్న ఇబ్బందులను గుర్తించి వారి వద్దకే డాక్టర్లు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఎన్టీఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రభుత్వం పేదలను ఆదుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎప్పటికప్పుడు బిల్లులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో శంకర నేత్రాలయం వైద్యులు, టీడీపీ మండలాధ్యక్షుడు మెట్టు శ్రీనివాసులరెడ్డి, క్లస్టర్‌ ఇన్‌చార్జి శ్రీనివాసులరెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రగుంట్ల నాగేశ్వరరావు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు జడ్డా రవి, భాస్కర్‌ రెడ్డి పాల్గొన్నారు.

మహానాడును విజయవంతం చేయాలి

పెద్దారవీడు మండలంలో ఈ నెల 27, 28 తేదీల్లో వర్చువల్‌గా జరిగే మహానాడును విజయవంతం చేయాలని టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు అన్నారు. మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో ఆదివారం టీడీపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ వర్చువల్‌ మహానాడుకు సంబంధించి పెద్దారవీడు మండలంలో రెండు క్లస్టర్లుగా విభజించినట్లు చెప్పారు. దేవరాజుగట్టు, హనుమాన్‌ జంక్షన్‌(కుంట)లలో వాటి ఏర్పా ట్లు చేస్తున్నామన్నారు. మహానాడులో పాల్గొనే కార్యకర్తల కోసం సకల ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నాయకులు, కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు మెట్టు శ్రీనివాసులరెడ్డి, క్లస్టర్‌ ఇన్‌చార్జి గొట్టం శ్రీనివాసులరెడ్డి, నీటి సంఘం అధ్యక్షుడు గొట్టం రఘురామిరెడ్డి, నాయకులు చింతగుంట్ల సుబ్బరామిరెడ్డి, చంద్రగుంట్ల నాగేశ్వరరావు, జడ్డా రవి, దొడ్లా భాస్కర్‌రెడ్డి, కొండారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - May 24 , 2026 | 11:39 PM