Share News

బియ్యం ధరల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి

ABN , Publish Date - Oct 11 , 2026 | 11:02 PM

ఎల్‌నినో ప్రభావంతో పాటు బియ్యం ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తుండటంతో వాటి ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రెండురకాల నాణ్యమైన బియ్యాన్ని రైతు బజార్ల ద్వారా విక్రయించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించడంతో తదనుగుణంగా సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకున్నారు.

బియ్యం ధరల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి
మేదరమెట్ల రైస్‌ మిల్లులో బియ్యం ప్యాకింగ్‌ను పరిశీలిస్తున్న డీఎ్‌సవో పద్మశ్రీ

రైతు బజార్ల ద్వారా తక్కువ ధరలకే విక్రయాలు

రెండు రకాల బస్తాలను ఏర్పాటు చేస్తున్న అధికారులు

ఒంగోలు కలెక్టరేట్‌, అక్టోబరు 11 (ఆంరఽధజ్యోతి) : ఎల్‌నినో ప్రభావంతో పాటు బియ్యం ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తుండటంతో వాటి ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రెండురకాల నాణ్యమైన బియ్యాన్ని రైతు బజార్ల ద్వారా విక్రయించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించడంతో తదనుగుణంగా సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకున్నారు. బియ్యాన్ని రైతు బజార్ల ద్వారా సోమవారం నుంచి విక్రయాలు ప్రారంభించాలని ఆదేశించడంతో తదనుగుణంగా అమ్మకాలను చేపట్టేందుకు చర్యలు తీసుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో పౌరసరఫరాల శాఖ అధికారులు బియ్యం అమ్మకాలపై దృష్టి సారించారు. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్ల ద్వారా బీపీటీ బియ్యాన్ని కిలో రూ.49కి విక్రయించాలని ఆదేశించింది. దీంతో ఆ శాఖ అధికారులు మిల్లర్లతో ప్రత్యేక సమావే శాలు నిర్వహించి 26 కి లోల బస్తాలను ఏర్పాటు చేస్తున్నారు.

జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులో ఆడించి ప్రకాశంతోపాటు మార్కాపురం, బాపట్ల, పల్నాడు జిల్లాలకు సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. సూపర్‌ ఫైన్‌ రకం బియ్యం నెల్లూరు జిల్లా నుంచి మన జిల్లాకు సరఫరా కానున్నాయి. సూపర్‌ఫైన్‌ బియ్యం కిలో రూ. 50కి విక్రయించనున్నారు. ఒక్కొక్క కుటుంబానికి నెలకు 26 కిలోల ప్యాకింగ్‌ బస్తాలను ప్రజలకు అందించనున్నారు. ప్రభుత్వ అదేశాలతో మేదరమెట్లలోని రైస్‌ మిల్లులో జరుగుతున్న బియ్యం బస్తాల ప్యాకింగ్‌ను జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి పద్మశ్రీ పరిశీలించారు. బియ్యం నాణ్యతతో పాటు బస్తాల తూకాన్ని కూడా పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో బియ్యం అమ్మకాలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు పద్మశ్రీ తెలిపారు.

Updated Date - Oct 11 , 2026 | 11:02 PM