దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
ABN , Publish Date - Mar 19 , 2026 | 12:23 AM
దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, ఎమ్మెల్యే కొండయ్య పేర్కొన్నారు.
చీరాల, మార్చి18 (ఆంధ్రజ్యోతి) : దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, ఎమ్మెల్యే కొండయ్య పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుండి ప్రారంభమైన దివ్యాంగ శక్తి(దివ్యాంగులకు ఉచిత బస్)ను ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. ఉచిత బస్ ప్రయాణంతో జీవనమనుగడకు అదనపు శక్తి లభిస్తుందన్నారు. మహిళలకు, నిస్సహాయ దివ్యాంగులకు ఈ ప్రయాణం ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. చీరాల నుండి చినగంజాం వరకు బస్‌లో దివ్యాంగులతో కలిసి ప్రయాణించి ఉత్సాహ పరిచారు. కార్యక్రమంలో ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు, డిపో మేనేజర్ శ్యామల, పెద్ద సంఖ్యలో కూటమి నేతలు కార్యకర్తలు దివ్యాంగులు పాల్గొన్నారు.
పర్చూరు : దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రజా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని పర్చూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుంజి వెంకట్రావు అన్నారు. దివ్యాంగులకు ప్రభుత్వం కల్పించిన ఉచిత బస్సు సేవను పర్చూరులో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్.లవన్నతో కలసి ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ దివ్యాంగుల ఉగాది పండుగ సందర్భంగా ఈ పథకం దివ్యాంగులకు ప్రత్యేక కానుకగా నిలుస్తుందన్నారు. భవిష్యత్తులో ఈ పథకం ద్వారా దివ్యాంగులకు జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడతాయన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ పి.బ్రహ్మయ్య, ఎంపీడీవో ప్రద్యుమ్న కుమార్, వివిద కార్పొరేషన్ల డైరెక్టర్ షేక్.షంషుద్దీన్, కారుమంచి వెంకటకృష్ణారావు, టీడీపీ నేతలు ఆకుల శ్రీనివాసరావు, కొండ్రగంటి శివనాగేశ్వరరావు, మల్లాధి సురేష్, బి.సాంబశివరావు, మామిడిపాక హరిప్రసాద్, చెరుకూరి చింపయ్య, విన్నకోట సతీష్, శ్రీరాం వెంకట సుబ్బా రావు, దండా శ్రీనివాసరావు, హై టెక్ సుభానీ, బీజేపీ నాయకులు అవపాల కృష్ణ, జనసేన నేతలు తులసి చంటి, కందా సురేంద్రబాబు పాల్గొన్నారు.
చినగంజాం : దివ్యాంగుల జీవితాలలో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చేస్తున్న కృషి మరువలేనిదని దివ్యాంగుల సమాఖ్య మండల ఉపాధ్యక్ష కార్యదర్శులు కే.సురేష్ బాబు, వడ్లమూడి వేణులు అన్నారు. స్థానిక వెలుగు కార్యాలయ ఆవరణలో దివ్యాంగుల శక్తి ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీ.ఎం పవన్ కళ్యాణ్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుల చిత్రపటాలకు బుధవారం పాలాభిషేకం చేశారు. దివ్యాంగుల కోసం ఉచిత బస్సు ప్రయాణం, బ్యాక్ లాగ్ పోస్టులు, విడుదల చేయడం, సదరం స్లాట్ ఏర్పాటు చేసి, దివ్యాంగుల జీవోపా ధులను పెంపొందించేందుకు ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందని వేణు అన్నారు. కార్యక్రమంలో ఏపీఎం గద్దె పెదసుబ్బారావు, సీసీలు వెంకటస్వామి, శ్రీలక్ష్మి, మాధ వి, మండల దివ్యాంగుల సమాఖ్య కోశాధికారి ఎం.హనుమంతరావు, సభ్యులు వీవోఏలు పాల్గొన్నారు.
దివ్యాంగులకు చంద్రన్న కానుక
చినగంజాం : చీరాల నుంచి ప్రారంభమైన దివ్యాంగశక్తి బస్సు ప్రయాణాన్ని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ప్రారంభించారు. దివ్యాంగులతో వచ్చిన చీరాల ఎమ్మెల్యే, చీరాల ఆర్డీవో తూమాటి చంద్రశేఖర్ నాయుడులు స్థానిక మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ జె.ప్రభాకరరావు, చీరాల డిపో మేనేజర్ శ్యామల, పలు శాఖల అధికారులు, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.