మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
ABN , Publish Date - May 20 , 2026 | 12:19 AM
మత్స్యకారుల సంక్షేమానికి, అభివృద్ధికి కూట మి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర సాంఘీక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీ రాంజనేయస్వామి పేర్కొన్నారు. సింగరాయ కొండ మండలం పాకల పంచాయతీ పరిధి లోని పల్లెపాలెం, చెల్లెమ్మగారిపాలెం, క్రాంతిన గర్, పోతయ్యగారి పట్టపుపాలెం, ఊళ్లపాలెం పంచాయతీ పరిధిలోని పల్లెపాలెల్లో మంగళ వారం నిర్వహించిన మత్స్యకార సేవ పథకం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
మంత్రి డాక్టర్ స్వామి
మత్స్యకార సేవ పథకం కింద లబ్ధిదారులకు విరామ భృతి
సింగరాయకొండ, మే 19 (ఆంధ్రజ్యోతి): మత్స్యకారుల సంక్షేమానికి, అభివృద్ధికి కూట మి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర సాంఘీక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీ రాంజనేయస్వామి పేర్కొన్నారు. సింగరాయ కొండ మండలం పాకల పంచాయతీ పరిధి లోని పల్లెపాలెం, చెల్లెమ్మగారిపాలెం, క్రాంతిన గర్, పోతయ్యగారి పట్టపుపాలెం, ఊళ్లపాలెం పంచాయతీ పరిధిలోని పల్లెపాలెల్లో మంగళ వారం నిర్వహించిన మత్స్యకార సేవ పథకం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వేట నిషేధిత సమయం లో రూ.20వేలు ఇచ్చిన ఘనత సీఎం చంద్ర బాబు నాయుడుకే దక్కుతుందన్నారు. మత్స్య కార సేవా కార్యక్రమంలో భాగంగా మండ లంలోని పాకల, ఊళ్లపాలెం గ్రామాల్లో 1,669 మంది వేటకు వెళ్లే మత్స్యకారులకు రూ.3.33 కోట్లు భృతిని వారి బ్యాంకు ఖాతాలకు జమైన ట్లు తెలిపారు. 60శాతం సబ్సిడీతో వలలు, బోట్లు, ఇంజన్లు అందజేస్తామని చెప్పారు. తీర ప్రాంతంలో ప్రధాన సమస్య అయిన సోనాబో ట్ల అక్రమ చొరబాటులను అరికట్టడానికి ప్ర భుత్వం నాలుగు హైస్పీడ్ మెకనైజ్‌డు బోటు ్లను కొనుగోలు చేస్తుందన్నారు. అంతేకాకుండా 60శాతం సబ్సిడీతో 200 మెకనైజ్‌డు బోట్లును మత్స్యకారులకు అందిస్తామని పేర్కొన్నారు. పాకల తీరంలో ఫిషింగ్ ల్యాండ్ సెంటర్ ని ర్మాణానికి మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యతో కలిసి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో చిరంజీవి, తహ సీల్దార్ రాజేష్, ఎంపీడీవో జయమణి, టీడీపీ మండల అధ్యక్షుడు మించల బ్రహ్మయ్య, నేత లు సుబ్బారావు, చంటి, సత్యన్నారాయణ, కృష్ణా, సైకం చంద్రశేఖర్, రాజగోపాల్‌రెడ్డి, గాలి హరిబాబు, కానాల బాలాజీ, మురళి, గు దే వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.