Share News

వెలిగొండ నిర్వాసితులకు ప్రభుత్వం అండ

ABN , Publish Date - Sep 24 , 2026 | 03:19 AM

వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మార్కాపురం కలెక్టర్‌ విజయసునీత అన్నారు. స్థానిక మార్కెట్‌ యార్డులో 11 ముంపు గ్రామాల్లో 2026 ఆగస్టు 31 నాటికి 18 ఏళ్లు నిండిన (మేజర్‌) నిర్వాసితుల ధ్రువీకరణ పత్రాలను ప్రత్యేక అధికారుల బృందం పరిశీలించే కార్యక్రమాన్ని ఆమె బుధవారం పర్యవేక్షించారు.

వెలిగొండ నిర్వాసితులకు ప్రభుత్వం అండ
వెలిగొండ నిర్వాసితుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలిస్తున్న మార్కాపురం కలెక్టర్‌ విజయసునీత

మార్కాపురం కలెక్టర్‌ విజయ సునీత

మార్కాపురం రూరల్‌, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మార్కాపురం కలెక్టర్‌ విజయసునీత అన్నారు. స్థానిక మార్కెట్‌ యార్డులో 11 ముంపు గ్రామాల్లో 2026 ఆగస్టు 31 నాటికి 18 ఏళ్లు నిండిన (మేజర్‌) నిర్వాసితుల ధ్రువీకరణ పత్రాలను ప్రత్యేక అధికారుల బృందం పరిశీలించే కార్యక్రమాన్ని ఆమె బుధవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల్లో 7,321 ముంపు కుటుంబాలు ఉండగా 6,960 పైగా అవార్డులు పాస్‌ అయ్యాయన్నారు. 6,151 కుటుంబాలకు రూ.758 కోట్ల పరిహారం వారి ఖాతాలలో జమచేయడం జరిగిందన్నారు. 2026 ఆగస్టు 31 నాటికి మేజర్‌లైన వారికి ప్రభుత్వం రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిందని తెలిపారు. వీరితోపాటు గెజిట్‌లో పేర్లు మిస్‌ అయి ప్రస్తుతం అర్హుల జాబితాలో చేరిన వారి ధ్రువీకరణ పత్రాలను పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. కార్యక్రమంలో జేసీ శ్రీనివాసులు, ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, డీఆర్‌డీఏ పీడీ శివనారాయణ, డ్వామా పీడీ సువార్త, వ్యవసాయ శాఖ జేడీ బాలాజీనాయక్‌, తహసీల్దార్‌లు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 24 , 2026 | 03:19 AM