Share News

ధరల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి

ABN , Publish Date - Aug 09 , 2026 | 02:43 AM

బియ్యం ధరల నియంత్రణపై ప్రజాప్రభుత్వం దృష్టి సారించింది. కొంతకాలంగా బియ్యం ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తుండ టంతో అందుకు గల కారణాలను తెలుసుకు నేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యా ప్తంగా ఉన్న రైస్‌మిల్లులను తనిఖీలు చేసి అక్కడ ఉన్న బియ్యం, ధాన్యం నిల్వల వివరా లను వెంటనే నివేదించాలని ఆదేశించింది.

ధరల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి
మేదరమెట్లలోని రైస్‌మిల్లులో బియ్యం నిల్వలను పరిశీలిస్తున్న డీఎస్‌వో పద్మశ్రీ, అధికారులు

రైస్‌ మిల్లులను తనిఖీ చేసిన

పౌరసరఫరాలు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు

నిల్వ ఉన్న ధాన్యం, బియ్యం పరిశీలన

రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక

ఒంగోలు కలెక్టరేట్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): బియ్యం ధరల నియంత్రణపై ప్రజాప్రభుత్వం దృష్టి సారించింది. కొంతకాలంగా బియ్యం ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తుండ టంతో అందుకు గల కారణాలను తెలుసుకు నేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యా ప్తంగా ఉన్న రైస్‌మిల్లులను తనిఖీలు చేసి అక్కడ ఉన్న బియ్యం, ధాన్యం నిల్వల వివరా లను వెంటనే నివేదించాలని ఆదేశించింది. తదనుగుణంగా జిల్లావ్యాప్తంగా పౌరసరఫరా లశాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తనిఖీలు ప్రారంభించారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు జిల్లాలోని రైస్‌ మిల్లులను డీఎస్‌వో పద్మశ్రీ ఆధ్వర్యంలో ఆ శాఖ అధికా రులు, సిబ్బంది తనిఖీ చేశారు. రైస్‌మిల్లుల వారీగా ఎంత ధాన్యం కొనుగోలు చేశారు, ఇప్పటి వరకు ఎంత విక్రయాలు చేశారు ఇంకా మిల్లుల్లో ఎంత ధాన్యం, బియ్యం ఉన్నాయన్న వివరాలను సేకరిస్తున్నారు. ఆయా రైస్‌ మిల్లుల్లో ఉండే రికార్డులతోపాటు ప్రత్యక్షంగా నిల్వలను కూడా పరిశీలించినట్లు తెలుస్తోంది. జిల్లాలోని మేదరమెట్ల, టంగుటూరు మండలం ఆలకూరపాడులోని రైస్‌ మిల్లులను స్వయంగా డీఎస్‌వోతోపాటు ఇతర అధికారులు పరిశీలించారు. మరోవైపు ఆయా రైస్‌మిల్లుల ద్వారా ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత బియ్యాన్ని తయారు చేసి విక్రయాలు చేసిన తీరును కూడా తెలుసుకున్నట్లు సమాచారం. బియ్యం ఎక్కడైనా నిల్వ చేశారా అన్న అంశంపై కూడా ఆరా తీసినట్లు సమాచారం. అలా జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేసిన ఆ శాఖ అఽధికారులు ఆయా మిల్లుల వారీగా రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు తెలిసింది. అనంతరం ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.

Updated Date - Aug 09 , 2026 | 02:43 AM