అభివృద్ధే లక్ష్యంగా పాలన
ABN , Publish Date - Oct 13 , 2026 | 10:46 PM
అభివృద్ధే లక్ష్యంగా ప్రభు త్వ పాలన జరుగుతోందని ఎమ్మెల్యే కం దుల నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని నికరంపల్లి గ్రామంలో పంచాయతీ భవనం, గ్రామ ఆరోగ్య కేంద్రం, సీసీ రోడ్లను మంగళవారం అధికారులు, నాయకులతో కలిసి ప్రారంభించారు.
ఎమ్మెల్యే నారాయణరెడ్డి 8 రూ.83 లక్షలతో పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే
మార్కాపురం రూరల్, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి) : అభివృద్ధే లక్ష్యంగా ప్రభు త్వ పాలన జరుగుతోందని ఎమ్మెల్యే కం దుల నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని నికరంపల్లి గ్రామంలో పంచాయతీ భవనం, గ్రామ ఆరోగ్య కేంద్రం, సీసీ రోడ్లను మంగళవారం అధికారులు, నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల మాట్లాడుతూ నికరంపల్లి గ్రామంలో మునుపెన్నడూ ఎవరూ చేయని అభివృద్ధి పనులను చేసి చూపించామన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి పార్టీల అభ్యర్థులను గెలిపించి గ్రామస్థులు అండగా నిలవాలన్నారు. గ్రామంలో వీబీ జీరాంజీ రూ.32 లక్షల నిధులతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని, పల్లెపండుగ 2.0లో రూ.15లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను, రూ.36లక్షల 15 ఫైనాన్స్ నిధులతో నిర్మించిన గ్రామ ఆరోగ్య సెంటర్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీవో బాలచెన్నయ్య, పీఆర్‌ఏఈ మోహన్‌రాజ్, గ్రామ పంచాయతీ అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
కొనకనమిట్ల : మార్కాపురం నియోజకవర్గంలోనే కొనకనమిట్ల మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే కం దుల నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని వెలిగండ్ల గ్రామంలో మంగళవారం రూ.22లక్షలతో సీసీరోడ్డు నిర్మాణానికి శం కుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో గొడ్డలిపార్టీ నాయకులు నియోజకవర్గాన్ని గాలికి వదిలేశా రన్నారు. గత వైసీపీ నాయకులు అభివృద్ధిని పక్కన పెట్టి అరాచకాలు, వేధింపులు, భూకబ్జాలకు కేరాఫ్ అడ్ర్‌సగా మార్చి ప్రజల విశ్వాశాన్ని కోల్పోయారని చెప్పారు. అభివృద్ధి ఒక్కటే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మోరబోయిన బాబూరావు, వెలిగొండ దేవస్థాన చైర్మన్ కుందూరు కాశిరెడ్డి, గొట్లగట్టు మాజీ సర్పంచ్ పెరికే సుఖ్‌దేవ్, టీడీపీ నాయకులు భాషాపతినాయు డు, మువ్వా కాటంరాజు, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.