యోగాతోనే ఆరోగ్యభాగ్యం
ABN , Publish Date - Jun 15 , 2026 | 11:35 PM
త్యం యోగా సాధన చేయటం ద్వారా ఆరోగ్య భాగ్యం కలుగుతుందని కలెక్టర్ రాజాబాబు చెప్పారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగా సాధనలో భాగంగా సోమవారం ఉదయం కొత్తపట్నం పల్లెపాలెం సముద్రతీరంలో జరిగిన యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
కలెక్టర్ రాజాబాబు
కొత్తపట్నం తీరంలో యోగా సాధన
కొత్తపట్నం, జూన్ 15(ఆంధ్రజ్యోతి) : నిత్యం యోగా సాధన చేయటం ద్వారా ఆరోగ్య భాగ్యం కలుగుతుందని కలెక్టర్ రాజాబాబు చెప్పారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగా సాధనలో భాగంగా సోమవారం ఉదయం కొత్తపట్నం పల్లెపాలెం సముద్రతీరంలో జరిగిన యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయనతో పాటు సంతనూతలపాడు శాసన సభ్యులు బీఎన్ విజయకుమార్, పీడీసీసీ బ్యాంకు చైర్మన్ డాక్టర్ కామేపల్లి శ్రీనివాసరావు, టూరిజం బోర్డు చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ దేశంలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా గొప్ప కళగా యోగా గుర్తింపు పొందిందన్నారు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని స్థాపించేందుకు ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. యోగ సాధన ద్వారా శారీరక ఆరోగ్యం మానసిక ప్రశాంతత లభిస్తాయన్నారు. బాలాజీ మాట్లాడుతూ అన్ని పాఠశాలలు, కళాశాలల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో యోగ సాధన అమలయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్ మాట్లాడుతూ ఆరోగ్య, సంతోష, సంపన్నవంతమైన రాష్ట్ర ఆవిష్కరణ కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక అధికారి రవికుమార్, యోగాంధ్ర నోడల్ ఆఫీసర్ డాక్టర్ భీమ్‌నాథ్, జిల్లా అధికారులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు.