Share News

బంగారు గొలుసు చోరీ

ABN , Publish Date - Sep 12 , 2026 | 12:29 AM

పోలీసులమని మాయమాటలు చెప్పి మత్తుమందు ఇచ్చి మెడలోని బంగారు గొలుసును దోచుకెళ్లిన సంఘటన కొమరోలులోని నయారా పెట్రోల్‌ బంకు సమీపంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.

బంగారు గొలుసు చోరీ

కొమరోలు, సెస్టెంబరు 11(ఆంధ్రజ్యోతి) : పోలీసులమని మాయమాటలు చెప్పి మత్తుమందు ఇచ్చి మెడలోని బంగారు గొలుసును దోచుకెళ్లిన సంఘటన కొమరోలులోని నయారా పెట్రోల్‌ బంకు సమీపంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... మండలంలోని గోనెపల్లికి చెందిన పునుగుపాటి గురవయ్య అతని భార్య నాగమణితో కలసి టీవీఎస్‌ ఎక్సల్‌ బండిపై పొలం పనులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు బండిని ఆపారు. తాము పోలీసులం మీరు బంగారు దండలు వేసుకుని రోడ్లపై తిరగకూడదు, దొంగలు ఉన్నారు అని చెప్పి ఒక పేపర్‌ ఇచ్చి ఇందులో దాచిపెట్టుకోండి అని చెప్పారు. ఆ మాటలను రైతులు నమ్మి బంగారు దండను పేపర్‌లో పెట్టి సరికి మైకంలోకి వెళ్లారు. కొద్దిసేపు తర్వాత మెలకువలోకి వచ్చే చూసేసరికి బంగారు గొలుసు మాయమైంది. బాధితులు వెంటనే పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్త్తు చేస్తున్నట్లు ఎస్సై నాగేంద్రరావు తెలిపారు.

Updated Date - Sep 12 , 2026 | 12:29 AM