మెగా పీటీఎంకు నిధులు విడుదల
ABN , Publish Date - Jul 23 , 2026 | 03:07 AM
ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఈనెల 24న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (మెగా పీటీఎం) నిర్వహణకు ప్రభుత్వం బుధవారం నిధులు విడుదల చేసింది. పాఠశా లు, కళాశాలల్లో విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకొని నిధులను కేటా యించింది.
ప్రకాశంకు రూ.34.7 లక్షలు.. మార్కాపురం జిల్లాకు రూ.31.61 లక్షలు
ఒంగోలు విద్య, జూలై 22 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఈనెల 24న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (మెగా పీటీఎం) నిర్వహణకు ప్రభుత్వం బుధవారం నిధులు విడుదల చేసింది. పాఠశా లు, కళాశాలల్లో విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకొని నిధులను కేటా యించింది. రాష్ట్రంలో 44,981 విద్యాసంస్థలకు రూ.9.98కోట్లను విడుదల చేస్తూ సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీచేశారు. ఈ నిధులను బుధవారం సాయంత్రానికి పాఠశాలల హెచ్‌ఎంలు, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్ల బ్యాంకు ఖాతాలకు జమ చేయాలని ఎస్పీడీ ఆదేశించారు. మెగా పీటీఎంల నిర్వహణకు ప్రకాశం జిల్లాకు రూ 34.72 లక్షలు విడుదల య్యాయి. జిల్లాలో 30మందిలోపు 698, 100మందిలోపు 542, 250 మందిలోపు 226, వెయ్యి మందిలోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలు 90 మొత్తం 1,556 స్కూళ్లకు ఈ నిధులు విడులయ్యాయి. మార్కాపురం జిల్లాకు రూ.31.61 లక్షలు కేటాయించారు. ఈ జిల్లాలో 30మందిలోపు విద్యార్థులున్న 640, 100 మంది లోపు 496, 250మంది లోపు 210, వెయ్యి లోపు 84, వెయ్యి మందిపైన విద్యార్థులు ఉన్న పాఠశాలలు రెండు.. మొత్తం 1,405 స్కూళ్లకు రూ.31.61 లక్షలు కేటాయించారు. ప్రకాశం జిల్లాలో వెయ్యి మందిపైన విద్యార్థులు ఉన్న పాఠశాల ఒక్కటి కూడా లేదు.