గ్రామీణ రహదారులకు నిధులు
ABN , Publish Date - Jan 04 , 2026 | 01:49 AM
మండల కేంద్రానికి గ్రామాలతో అనుసంధానం చేసే రోడ్ల మరమ్మతులకు కూటమి ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది.
మార్టూరు, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రానికి గ్రామాలతో అనుసంధానం చేసే రోడ్ల మరమ్మతులకు కూటమి ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు నిధులు విధిల్చిన పాపాన పోలేదు. దీంతో ప్రజలు మొకాళ్ల లోతు గోతు ల్లోనే తమ ప్రయాణాలను కొనసాగించారు. ప్రస్తుతం ప్రజా కూటమి ప్రభుత్వం అధికారంలోని వచ్చిన తర్వాత గ్రామీణ రహదారులపై ప్రత్యేక దృష్టి సారించింది. అధికారం వచ్చిన ఆరు నెలల్లోనే రహదారుల మరమ్మతులకు నిధులను మంజూరు చేసింది. మార్టూరు, యద్దనపూడి మండలా ల్లో ప్రజలకు నిత్యం ఉపయోగపడే రహదారుల మరమ్మతుల కోసం నిధులు మంజూరయ్యాయి. వాటి లో మార్టూరు మండలంలో కోనం కి నుంచి వలపర్ల గ్రామానికి రూ.4 కోట్లు, బొబ్బేపల్లి నుంచి రాజుగారి పాలెం రోడ్డుకు రూ.77 లక్షలు, నేషనల్ హైవే నుంచి అమరావతి నూలుమిల్లు వెనుక నుంచి రాజుగారిపాలెం వరకు రూ.1.76 కోట్లు, మార్టూరు నుంచి బొబ్బే పల్లి దండుదారి వరకు రూ.2.20 కోట్లు, మార్టూరు నుంచి రాజు గారిపాలెం మీదగా ద్రోణాదుల వరకు రూ.2.20కోట్లు నిదులు మంజూరయ్యాయి. అదేవిధంగా యద్దనపూడి మండలంలో గన్నవరం నుంచి పూనూరు వరకు రోడ్డు మరమ్మతులకు 3.80కోట్లు, జాతీయ రహదారి నుంచి అనంతవరం రోడ్డుకు రూ.2.20 కోట్లు నిధులు మంజూరయ్యాయి. అయితే ఈ రోడ్లు నిర్మాణాలను త్వరితంగా పూర్తిచేయాలని, ప్రజలు ఆశ పడుతున్నారు.
బొల్లాపల్లి వరకు పూర్తయిన రోడ్డు నిర్మాణం
16వ జాతీయరహదారి నుంచి బొల్లాపల్లి గ్రామం వరకు రెండు కిమీలు రూ.65 లక్షలతో తారురోడ్డు నిర్మాణం పూర్తయ్యింది. దీంతో కోలలపూడి, తాటివారి పాలెం, బొల్లాపల్లి గ్రామస్థులకు హైవేపైకి రావడానికి ప్రయాణం సులభతరమయ్యింది. గత ప్రభుత్వంలో ఈ రోడ్డులో ఏర్పడిన గుంతలలో ప్రజలు ప్రయాణించలేక నానాయాతనలు పడ్డారు. కూటమి ప్రభుత్వం రాకతో తారురోడ్డు నిర్మాణం చేపడుతుండడంతో గ్రామానికి కళ వచ్చిందని బొల్లాపల్లి గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.