Share News

నలుగురు ఎస్సైలు బదిలీ

ABN , Publish Date - Jul 05 , 2026 | 11:44 PM

జిల్లాలో నలుగురు ఎస్సైలు బదిలీ అయ్యారు. ఈమేరకు ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

నలుగురు ఎస్సైలు బదిలీ

ఒంగోలు క్రైం, జూలై 5 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో నలుగురు ఎస్సైలు బదిలీ అయ్యారు. ఈమేరకు ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం టంగుటూరు ఎస్సైగా పనిచేస్తున్న పి.నాగమల్లేశ్వరరావును సంతమాగులూరుకు స్థానచలనం కల్పించారు. ఒంగోలు తాలుకా పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న బి.ఫణిభూషణ్‌ను టంగుటూరు ఎస్సైగా నియమించారు. మర్రిపూడి ఎస్సై టి.రమే్‌షబాబును మేదరమెట్లకు, ఒంగోలు తాలుకా పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్సై బి.సుదర్శన్‌ను మర్రిపూడికి బదిలీ చేశారు. మేదరమెట్ల ఎస్సై రఫిని జిల్లా వీఆర్‌కు పిలిచారు. గత కొంతకాలంగా ఖాళీగా ఉన్న ముండ్లమూరు పోలీసు స్టేషన్‌కు ఎస్సైగా కోటేశ్వరరావును, దర్శి ఎస్సైగా ఏడుకొండలను నియమించే అవకాశం ఉంది. వారిద్దరూ ఆదివారం ఎస్పీ హర్షవర్ధన్‌రాజును కలిశారు.

Updated Date - Jul 05 , 2026 | 11:44 PM