నలుగురు ఎర్ర చందనం స్మగ్లర్లు అరెస్ట్
ABN , Publish Date - Jul 17 , 2026 | 11:55 PM
వెలిగండ్ల మండలంలోని వెదుళ్లచెరువు అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలను తరలించేందుకు ప్రయత్నిస్తున్న నలుగురు వ్యక్తులను కనిగిరి అటవీశాఖ అధికారి ఆరీ్‌ఫఖాన్ ఆధ్వర్యంలో అదుపులో తీసుకున్నారు.
తుపాకీ, గొడ్డళ్లు స్వాధీనం
వెలిగండ్ల, జూలై 17 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని వెదుళ్లచెరువు అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలను తరలించేందుకు ప్రయత్నిస్తున్న నలుగురు వ్యక్తులను కనిగిరి అటవీశాఖ అధికారి ఆరీ్‌ఫఖాన్ ఆధ్వర్యంలో అదుపులో తీసుకున్నారు. వారి వద్ద సుమారు 1 లక్ష విలువచేసే 10 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్ట్ చేశారు. ఈ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. అటవీశాఖ అధికారి ఆరీ్‌ఫఖాన్ తెలిపిన వివరాల ప్రకారం... వెలిగండ్ల మండలంలోని కట్టకిందపల్లికి చెందిన ఎగిటి గుంటెయ్య, ఓసూరి తిరుపతయ్య, గుడిపాటిపల్లికి చెందిన అతిరాసి చినగుంటెయ్య, బాల నారాయణలు కొన్ని రోజులుగా మండలంలోని గుడిపాటిపల్లి, వెదుళ్లచెరువు అడవుల్లో ఎర్ర చందనం దుంగలను నరికి స్మగ్లర్లకు విక్రయిస్తున్నట్లు సమాచారం అందింది. ఎఫ్‌ఎ్‌సవో మౌలాలి, సొఎ్‌సపురం స్ర్టెకింగ్ ఫోర్స్ సహకారంతో వాహన తనిఖీలు నిర్వహించగా అక్రమంగా తరలిస్తున్న ఎర్ర చందనం దుంగలు బయటపడ్డాయి. వాటిని కనిగిరి గోడౌన్‌కు తరలించి నిందితులు నలుగురిని అరెస్ట్ చేసి తిరుపతి కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు అటవీశాఖాధికారి తెలిపారు. వారి వద్ద లైసెన్స్ లేని తుపాకి, నాలుగు గొడ్డళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు.