మాజీ మంత్రి సురేష్ హౌస్ అరెస్ట్
ABN , Publish Date - Nov 18 , 2026 | 02:31 AM
వైసీపీ కొండపి ఇన్‌చార్జి, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ను మండలంలోని మూలగుంటపాడు పంచా యతీ పరిధిలో ఉన్న ఆయన క్యాంపు కార్యాల యంలో మంగళవారం పోలీ సులు హౌస్ అరెస్ట్ చేశారు. మర్రిపూడి మండలం కాకర్లలోని నామినేషన్ కేంద్రం వద్ద సోమవారం వైసీపీ సానుభూతిపరులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని ఆదిమూలపు సురేష్ హడావుడి చేశారు.
నోటీసు ఇచ్చిన పోలీసులు
సింగరాయకొండ, నవం బరు 17 (ఆంధ్రజ్యోతి): వైసీపీ కొండపి ఇన్‌చార్జి, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ను మండలంలోని మూలగుంటపాడు పంచా యతీ పరిధిలో ఉన్న ఆయన క్యాంపు కార్యాల యంలో మంగళవారం పోలీ సులు హౌస్ అరెస్ట్ చేశారు. మర్రిపూడి మండలం కాకర్లలోని నామినేషన్ కేంద్రం వద్ద సోమవారం వైసీపీ సానుభూతిపరులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని ఆదిమూలపు సురేష్ హడావుడి చేశారు. దీంతో ఉద్రిక్తపరిస్థితులు చోటుచేసుకున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని మంగళవారం నామినేషన్లకు ఎటువంటి ఆటంకం లేకుండా, శాంతిభద్రతలకు విఘాతం కల్పించకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రక్రియ ముగిసే వరకూ ఆయన్ను గృహ నిర్బంధంలో ఉంచారు. ఆమేరకు ఎస్సై లేళ్ల సుధీర్‌కుమార్ వైసీపీ ఇన్‌చార్జి సురేష్‌కు నోటీసు కూడా అందజేశారు.