పంచాయతీలకు ఆర్థిక పరిపుష్టిపై దృష్టి
ABN , Publish Date - Jul 08 , 2026 | 01:46 AM
గ్రామ పంచాయతీలు సొంత ఆదాయాన్ని పెంపొందించుకునే విధంగా ప్రభుత్వం విఽధి విధానాలను రూపొందించింది. తద్వారా ఆర్థిక స్వావలంబనకు సంకల్పించింది.
విధి విధానాలను ప్రకటించిన ప్రభుత్వం
ప్రధానంగా 20 అంశాలతో ఉత్తర్వులు
ఒంగోలు కలెక్టరేట్ జూలై 7 (ఆంధ్రజ్యోతి) : గ్రామ పంచాయతీలు సొంత ఆదాయాన్ని పెంపొందించుకునే విధంగా ప్రభుత్వం విఽధి విధానాలను రూపొందించింది. తద్వారా ఆర్థిక స్వావలంబనకు సంకల్పించింది. స్థానిక సంస్థల బలోపేతం కోసం రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామ పంచాయతీల్లో ఎక్కడికక్కడ ఆదాయం పెంచుకునేందుకు అనేక అంశాలపై అధ్య యనం చేయించారు. అనంతరం పంచా యతీల్లో ఆదాయం ఎలా పెంపొందిం చుకోవాలన్న దానిపై 20 అంశాలతో ఉత్తర్వు లను జారీ చేశారు. ఆయా పంచాయతీల్లో కార్యదర్శులు చేపట్టాల్సిన విధి విధానాలను కూడా ప్ర భుత్వమే రూపొందిం చింది. ఆయా అంశాల ద్వారా ఏవిధంగా నిధులను సమకూర్చుకోవచ్చో తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న గ్రాంట్ల ద్వారానే అభివృద్ధి కష్టమని స్పష్టం చేసింది. స్థానికంగా వనరులను సద్వినియోగం చేసుకొని ఆర్థిక స్వావలంబన సాధించడం ద్వారా ప్రగతిని మరింత వేగవంతం చేసుకునేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని అమలు చేయాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించింది.
ప్రభుత్వం సూచించిన అంశాలు ఇవీ..
గ్రామపంచాయతీల్లో కొత్తగా నిర్మించే భవ నాల గుర్తింపుతోపాటు అసెస్‌మెంట్‌లో లేని ఇళ్లను నమోదు చే సి ఆదాయాన్ని పెంచుకోవా లి. గ్రామపంచాయతీ పరిధిలోని ఖాళీ స్థలా లను గుర్తించి పన్ను పరిధిలోకి తీసుకురావాలి. వాణిజ్య భవనాలను రీఅసెస్‌మెంట్ చేసి వినియోగానికి అనుగుణంగా పన్నులు విధించాలి. ఏళ్ల తరబడి పేరుకుపోయిన బకాయిలను వంద రోజుల కలెక్షన్‌పై క్యాంపెయిన్ చేయాలి. గ్రామ పంచాయతీల్లో ట్రేడ్ లైసెన్సుల ద్వారా ఆదాయ వనరులు పెంచుకోవాలి. ఉదాహరణకు హోటళ్లు, టీస్టాల్స్, కిరాణాషాపులు, మెడికల్ షాపుల ద్వారా ట్రేడ్ లైసెన్సుల కింద పన్నులు వసూలు చేయాలి.
మాంసం, చేపల విక్రయకేంద్రాలకు వార్షిక లైసెన్స్‌లతోపాటు ఫెయిర్ ప్రైస్ షాపులు, గోదాముల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలి.
పంచాయతీలోని షాపింగ్ కాంప్లెక్స్‌లు, ఖాళీ స్థలాల్లో షాపుల నిర్మాణం ద్వారా అదనపు ఆదాయం.
కమ్యూనిటీ హాల్స్ ద్వారా పంచాయతీలకు పెంచుకోవడం.
నీటి వనరుల ద్వారా చేపల పెంపకం లీజులు, ఆర్వో ప్లాంట్ల ద్వారా యూజర్ చార్జీలు, హోటళ్లు, పరిశ్రమల నీటి కనెక్షన్ల ద్వారా ఆదాయ వనరులు పెంచుకోవాలి.
పంచాయతీల్లో వారాంతపు సంతల ద్వారా స్టాల్ ఫీజులు, పార్కింగ్ ఫీజులు, రైతు బజార్లలో రోజువారీ యూజర్ చార్జీలు, పశువుల సంతల్లో ప్రవేశ రుసుంల ద్వారా ఆర్థికవనరులు.
సోలార్ ఎనర్జీ ప్రాజెక్టులకు పంచాయతీ భూములు లీజులు, మొబైల్ టవర్లకు టవర్‌లీజు అద్దెలు వసూలు. బస్టాండ్లు, ప్రధాన రహదారులు వెంట ప్రకటనల ద్వారా ఆదాయం పెంచాలి.
జిల్లాలోని అనేక మండలాల్లో గ్రానైట్, బ్లాక్‌స్టోన్ క్వారీలు ఉన్న ప్రాంతాల్లో లారీ పార్కింగ్ యార్డులు, డ్రైవర్ల విశ్రాంతి కేంద్రాలు, తాగునీటి సదుపాయాల యూజర్ చార్జీలు, కమర్షియల్ షాపుల లీజులు, గ్రామ చెరువుల్లో చేపల పెంపకం హక్కుల వేలం, ఫిష్ మార్కెట్ ఫీజులు తదితర అంశాల ద్వారా స్థానికంగా పంచాయతీల్లో ఆదాయవనరులు పెంచుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.