జిల్లాలో ఐదు మలేరియా కేసులు
ABN , Publish Date - Aug 13 , 2026 | 02:51 AM
జిల్లాలో జరుగుతున్న ఫీవర్ సర్వేలో అక్కడక్కడా మలేరియా కేసులు బయటపడుతున్నాయి. పనుల కోసం ఇతర రాష్ట్రాలు, ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు వలస వచ్చిన వారికి మలేరియా ఉన్నట్లు తేలింది.
కొనసాగుతున్న ఫీవర్ సర్వే
ఒంగోలు కలెక్టరేట్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో జరుగుతున్న ఫీవర్ సర్వేలో అక్కడక్కడా మలేరియా కేసులు బయటపడుతున్నాయి. పనుల కోసం ఇతర రాష్ట్రాలు, ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు వలస వచ్చిన వారికి మలేరియా ఉన్నట్లు తేలింది. వలసదారులు నిత్యం కుటుంబంతో కలిసి రాకపోకలు ఎక్కువగా చేస్తుండటంతో ఈ కేసులు నమోదైనట్లు గుర్తించారు. ఇవి ఎక్కువగా చీమకుర్తి ప్రాంతంలోనే ఉన్నట్లు సమాచారం. జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో మన జిల్లావాసులకు మలేరియా సోకలేదు. కాకపోతే వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా అక్క డక్కడా సాధారణ జ్వరాలు, ఒళ్లునొప్పులు వంటివి ఉన్నట్లు సమాచారం. జిల్లావ్యాప్తంగా ఇంకా ఫీవర్ సర్వే కొనసాగుతోంది.