Share News

రోడ్డు ప్రమాదంలో మత్స్యకారుడు దుర్మరణం

ABN , Publish Date - Apr 07 , 2026 | 11:20 PM

వేటపాలెం - చీరాల జాతీయ రహదారిలోని పాత చాపల మార్కెట్‌ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రామచంద్రాపురానికి చెందిన మత్స్యకారుడు దుర్మరణం చెందాడు.

రోడ్డు ప్రమాదంలో   మత్స్యకారుడు దుర్మరణం

వేటపాలెం(చీరాల), ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి) : వేటపాలెం - చీరాల జాతీయ రహదారిలోని పాత చాపల మార్కెట్‌ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రామచంద్రాపురానికి చెందిన మత్స్యకారుడు దుర్మరణం చెందాడు. వేటపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వాడరేవులో ఉంటున్న భార్య పుట్టింటికి ద్విచక్ర వాహనంపై వెళ్లిన మత్స్యకారుడు రాజు(38) సాయంత్రం సమయంలో తిరిగి స్వగ్రామం వెళుతుండగా ఒంగోలు వైపు నుంచి బాపట్ల వైపు వెళుతున్న లారీ వేగంగా ఢీకొంది. ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందగా, వేటపాలెం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు.

Updated Date - Apr 07 , 2026 | 11:20 PM