రేపు తొలిదశ నోటిఫికేషన్
ABN , Publish Date - Nov 12 , 2026 | 02:26 AM
ఒంగోలు రెవెన్యూ డివిజన్‌లో తొలి దశ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. పది మండలాల్లో ఎన్నికలకు ఈనెల 13న రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ జారీచేయనున్నారు.
15 నుంచి పంచాయతీలలో నామినేషన్ల స్వీకరణ
ఈనెల 26న పోలింగ్.. అనంతరం ఓట్ల లెక్కింపు
కందుకూరు మున్సిపాలిటీకి అదే రోజు ఎన్నికలు
ఒంగోలు కలెక్టరేట్, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు రెవెన్యూ డివిజన్‌లో తొలి దశ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. పది మండలాల్లో ఎన్నికలకు ఈనెల 13న రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ జారీచేయనున్నారు. 15 నుంచి 17 వరకూ సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యుల నామినేషన్లు స్వీకరిస్తారు. పదివేల ఓటర్లు ఉంటే అదే గ్రామ పంచాయతీలో, ఓటర్లు తక్కువగా ఉన్న గ్రామ పంచాయతీలకు రెండు, మూడు కలిపి ఒకచోట నామినేషన్లు స్వీకరించనున్నారు. 18వతేదీ పరిశీలన ఉంటుంది. 21వతేదీ వరకు నామినేషన్ల ఉపసంహ రణకు గడువు ఇచ్చారు. ఆ రోజు పోటీలో ఉండే అభ్యర్థుల జాబితాలను అధికారులు ప్రకటిస్తారు. సర్పంచ్‌లు, వార్డు ్డసభ్యులకు ఎన్నికల సంఘం సూచించిన గుర్తులను కేటాయించనున్నారు. ఈనెల 26వ తేదీ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుంది. అనంతరం ఓట్ల లెక్కింపు ఉంటుంది. అందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కోర్టు కేసుల కారణంగా నిలిచిపోయిన కందుకూరు మున్సిపాలిటీ ఎన్నికలు ఈనెల 26వ తేదీన జరగనున్నాయి. అందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు.