Share News

తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ చక్రాల్లో మంటలు

ABN , Publish Date - Mar 19 , 2026 | 02:19 AM

గుంటూరు నుంచి తిరుపతికి వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌ రైలులో సాంకేతిక లోపం కారణంగా ఎస్‌7 బోగీ చక్రాల్లో మంటలు వచ్చాయి. ప్రయాణికులు చైన్‌ లాగడంతో మార్కాపురం జిల్లా తర్లుపాడుకు రెండు కిలోమీటర్ల దూరాన రాత్రి 7.45 సమయంలో రైలు నిలిచిపోయింది.

తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ చక్రాల్లో మంటలు
మరమ్మతుల కోసం తర్లుపాడు స్టేషన్‌లో నిలిచిన రైలు

భయాందోళనకు గురైన ప్రయాణికులు

తర్లుపాడు, మార్చి 18 (ఆంధ్రజోతి): గుంటూరు నుంచి తిరుపతికి వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌ రైలులో సాంకేతిక లోపం కారణంగా ఎస్‌7 బోగీ చక్రాల్లో మంటలు వచ్చాయి. ప్రయాణికులు చైన్‌ లాగడంతో మార్కాపురం జిల్లా తర్లుపాడుకు రెండు కిలోమీటర్ల దూరాన రాత్రి 7.45 సమయంలో రైలు నిలిచిపోయింది. డ్రైవర్‌ మంటలు వచ్చిన ఎస్‌7 బోగీ వద్దకు వెళ్లి చక్రాలను పరిశీలించారు. చీకటిగా ఉండటంతో మరలా రైలును నెమ్మదిగా తర్లుపాడు స్టేషన్‌లోకి తీసుకొచ్చి నిలిపివేశారు. ఎస్‌7 బోగీ చక్రాలకు ఉన్న బ్రేకును సరిచేసుకుని తిరిగి తిరుపతికి బయల్దేరారు. దాదాపుగా 15నిమిషాల పాటు తర్లుపాడు రైల్వేస్టేషన్‌ సమీపాన రైలు ఆగిపోయింది. మరమ్మతులు చేసిన అనంతరం 8గంటలకు బయలుదేరడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - Mar 19 , 2026 | 02:19 AM