Share News

ఫ్లవర్‌ డెకరేటర్స్‌ గోదాంలో అగ్నిప్రమాదం

ABN , Publish Date - Jul 21 , 2026 | 03:07 AM

ఫ్లవర్‌ డెకరేషన్‌కు సంబంధించిన వస్తువులు నిల్వ ఉంచే గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. సుమారు రూ.50 లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. ఈ ఘటన స్థానిక కొప్పోలు ఫ్లైఓవర్‌ సమీపంలోని జాతీయ రహదారి పక్కన చోటుచేసుకుంది.

ఫ్లవర్‌ డెకరేటర్స్‌ గోదాంలో అగ్నిప్రమాదం
గోదాం నుంచి వస్తున్న మంటలను ఆర్పుతున్న ఫైర్‌ సిబ్బంది

సుమారు రూ.50లక్షల ఆస్తినష్టం

విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూటే కారణమని అనుమానం

ఒంగోలు క్రైం, జూలై 20 (ఆంధ్రజ్యోతి) : ఫ్లవర్‌ డెకరేషన్‌కు సంబంధించిన వస్తువులు నిల్వ ఉంచే గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. సుమారు రూ.50 లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. ఈ ఘటన స్థానిక కొప్పోలు ఫ్లైఓవర్‌ సమీపంలోని జాతీయ రహదారి పక్కన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేఎంఎస్‌ ఫ్లవర్‌ డెకరేటర్స్‌ యజమాని ఎస్‌కే.రహంతుల్లా ఓ గోదాంను అద్దెకు తీసుకొని డెకరేషన్‌ సంబంధించిన సామగ్రి నిల్వ ఉంచారు. సోమవారం సాయంత్రం గోడౌన్‌ నుంచి దట్టమైన పొగలు వచ్చాయి. ఆతర్వాత మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక కేంద్రం అధికారి శ్రీనివాసులరెడ్డి నేతృత్యంలో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అప్పటికే లోపల ఉన్న సామగ్రి మొత్తం కాలిపోయింది. సుమా రు రూ.50లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు అంచనా. విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం చోటుచేసుకొని ఉంటుందని యజమాని చెప్తున్నారు.

Updated Date - Jul 21 , 2026 | 03:07 AM