Share News

ఎట్టకేలకు కదలిక

ABN , Publish Date - Jan 02 , 2026 | 01:27 AM

కోల్‌ సొసైటీలో చోటుచేసుకున్న అక్రమాలపై ఎట్టకేలకు కదలిక వచ్చింది. ఒంగోలు కేంద్రంగా నడు స్తున్న గుంటూరు జిల్లా పొగాకు ఉత్పత్తిదారుల, క్యూరర్ల సహకార మార్కెటింగ్‌ సొసైటీ (కోల్‌ సొసైటీ)పై వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదులపై సమగ్ర, లోతైన విచారణ చేసి నివేదిక ఇవ్వాలని జిల్లా సహకార అధికారి (డీసీవో)ని ఆశాఖ ఉన్నతా ధికారులు ఆదేశించారు.

ఎట్టకేలకు కదలిక
ఒంగోలులోని కోల్‌ సొసైటీ భవనం

కోల్‌సొసైటీపై సెక్షన్‌ 52 విచారణ

సమగ్రంగా చేయాలని డీసీవోకు కమిషనర్‌ ఆదేశం

హైకోర్టు కేసు నేపథ్యంలో కదిలిన ఉన్నతాధికారులు

ఒంగోలు, జనవరి 1 (ఆంధ్రజ్యోతి) : కోల్‌ సొసైటీలో చోటుచేసుకున్న అక్రమాలపై ఎట్టకేలకు కదలిక వచ్చింది. ఒంగోలు కేంద్రంగా నడు స్తున్న గుంటూరు జిల్లా పొగాకు ఉత్పత్తిదారుల, క్యూరర్ల సహకార మార్కెటింగ్‌ సొసైటీ (కోల్‌ సొసైటీ)పై వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదులపై సమగ్ర, లోతైన విచారణ చేసి నివేదిక ఇవ్వాలని జిల్లా సహకార అధికారి (డీసీవో)ని ఆశాఖ ఉన్నతా ధికారులు ఆదేశించారు. అందుకోసం సెక్షన్‌ 52 విచారణ నిర్వహించాలని సహకార కమిషనర్‌ అహ్మద్‌బాబు ఉత్తర్వులు జారీచేశారు. కోల్‌ సొసైటీ వ్యవహారంపై సంస్థ సభ్యులైన మద్దిరాలపాడుకు చెందిన షేక్‌ ఖాజావలి, కృష్ణారావు హైకోర్టులో పిటిషన్‌ వేసిన విషయం విదితమే. దానిపై విచారణ ప్రారంభమై ప్రతివాదులను అఫిడవిట్‌లు దాఖలు చేయాలని కోర్టు ఆదేశించడంతో వివిధ స్థాయిల్లోని అధికారులలో కదలిక వచ్చింది. ఈక్రమంలోనే కమిషనర్‌ స్పందించి ఈ ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రధానంగా సంఘ సభ్యులందరికీ తెలియజేయకుండా ప్రైవేటు వ్యక్తులను ఎన్నికల అధికారులుగా నియమించి అనైతిక ఎన్నిక నిర్వహించడంపై విచారణకు ఆదేశించారు. అలాగే సంఘ నిబంధనావళికి విరుద్ధంగాను, జనరల్‌ బాడీ సమావేశం తీర్మానం లేకుండా మేనేజింగ్‌ కమిటీ బ్యాంకుల్లోని రూ.2.15 కోట్లు డిపాజిట్లు ఉపసంహరించడం, రూ.11కోటల రుణాన్ని పొందడం, అధికారుల అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టి ప్రైవేటు వారికి లీజుకు ఇవ్వడంపై కూడా విచారణ చేపట్టనున్నారు.

పోలిశెట్టి అక్రమాలపైనా..

ప్రస్తుత కావలి డీఎల్‌సీవో పోలిశెట్టి రాజశేఖర్‌ 2018 నుంచి ఒంగోలులో జిల్లా సహకార ఆడిట్‌ అధికారిగా, డీసీవో, డీఎల్‌సీవోగా వివిధ బాధ్యతలలో పనిచేశారు. అతని హయాంలో కోల్‌సొసైటీ కమిటీ ఎన్నిక ఇతర అక్రమాలపై ప్రత్యేక ఆడిట్‌ నివేదికలు ఉన్నప్పటికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంతేకాక అక్రమంగా ఎన్నికైన కమిటీకి అనుకూలంగా వ్యవహరించారన్న ఫిర్యాదుపై ప్రస్తుతం సహకారశాఖ కమిషనర్‌ విచారణకు ఆదేశించారు. మరోవైపు ప్రస్తుతం ఒంగోలు డీఎల్‌సీవో శ్రీనివాసరావు కూడా కోల్‌సొసైటీపై విచారణ కోరుతూ డీసీవోకు తాజాగా లేఖ రాసినట్లు తెలిసింది. మొత్తం మీద హైకోర్టుకు వ్యవహరించడం చేరడంతో అధికారులలో కదలిక కనిపిస్తుంది.

Updated Date - Jan 02 , 2026 | 01:28 AM