జాడలేని తుది జాబితా
ABN , Publish Date - Jul 07 , 2026 | 02:25 AM
ఉపాధ్యాయుల పని సర్దుబాటుకు సంబంధించి సోమవారం జరగాల్సిన మండల స్థాయి మిగులు టీచర్ల సర్దుబాటు ప్రక్రియ ముందుకు సాగలేదు. ఇందుకు సంబంధించిన తుది సీనియారిటీ జాబితాల జాడ లేకపోవడంతో కౌన్సెలింగ్ నిర్వహణ డోలాయమా నంలో పడింది.
డోలాయమానంలో మండల స్థాయి కౌన్సెలింగ్
మిగులు ఉపాధ్యాయుల సర్దుబాటుకు బ్రేక్
ఒంగోలు విద్య, జూలై 6 (ఆంధ్రజ్యోతి) : ఉపాధ్యాయుల పని సర్దుబాటుకు సంబంధించి సోమవారం జరగాల్సిన మండల స్థాయి మిగులు టీచర్ల సర్దుబాటు ప్రక్రియ ముందుకు సాగలేదు. ఇందుకు సంబంధించిన తుది సీనియారిటీ జాబితాల జాడ లేకపోవడంతో కౌన్సెలింగ్ నిర్వహణ డోలాయమా నంలో పడింది. పాఠశాల విద్య డైరెక్టర్ కార్యాలయ ఐటీ విభాగం రూపొందిం చిన మిగులు టీచర్ల ప్రాథమిక జాబితాలపై ఫిర్యాదులు, అభ్యంతరాలు వెల్లువె త్తడంతో సర్దుబాటు కార్యక్రమానికి బ్రేకులు పడుతున్నాయి. ఆదివారం విడుద లైన ప్రాథమిక సీనియారిటీ జాబితాలపై వచ్చిన అభ్యంతరాలను అదేరోజు రాత్రి ఎంఈవో స్థాయిలో లాగిన్ ద్వారా సరిదిద్ది డైరెక్టర్ కార్యాలయానికి పంపారు. అక్కడి నుంచి తుది జాబితాల కోసం ఎంఈవోలు ఎదురుచూస్తున్నా వాటి జాడలేదు. మిగులు టీచర్ల ప్రాథమిక సీనియారిటీ జాబితాల్లో దొర్లిన తప్పులపై ఉపాధ్యాయులు అఽభ్యంతరం వ్యక్తం చేశారు. వాటిని సరిదిద్దేందుకు, జాబితాల్లో మార్పులు, చేర్పులు చేసేందుకు ఎంఈవోలకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. దాని ద్వారా తప్పులు సరిదిద్ది తుది సీనియారిటీ జాబితాల కోసం వివరాలను డైరెక్టర్ కార్యాలయ ఐటీ విభాగానికి పంపారు. అయితే మండల స్థాయిలో ఎంఈవోలు చేసిన మార్పులు, చేర్పులు ఐటీ విభాగంలో డిస్‌ప్లే కాకపోవడంతో సాయంత్రం ఐదు గంటలకు ఆ వివరాలను గూగుల్ షీట్‌లో పొందుపర్చి పంపించాలని ఎంఈవోలకు సమాచారం పంపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విలీనమైన ఎయిడెడ్ టీచర్లకు వారు చేరిన తేదీ నుంచి సీనియారిటీని పరిగణనలోకి తీసుకోవాలి. అయితే వారు సర్వీసులో చేరిన తేదీన చివరి సీనియారిటీని పరిగణనలోకి తీసుకోవడంతో సమస్యలు తలెత్తాయి. ఇటువంటి తప్పులన్నింటినీ ఎంఈవోలు తమకున్న ఎడిట్ ఆప్షన్ ద్వారా సరిచేశారు. అయితే ఐటీ విభాగం నుంచి తుది జాబితాలు విడుదల కాకపోవడంతో మిగులు టీచర్ల సర్దుబాటు కౌన్సెలింగ్‌కు బ్రేకులు పడ్డాయి. ప్రకాశం జిల్లాలో 71 మంది, మార్కాపురం జిల్లాలో 70మంది మిగులు టీచర్లను సర్దుబాటు చేయాల్సి ఉంది.