Share News

గుండెపోటుతో భక్తురాలు మృతి

ABN , Publish Date - Jul 19 , 2026 | 11:35 PM

తిరుపతమ్మ దేవస్థానం సత్రాల వద్ద మద్దిపాడు మండలంలోని బూరేపల్లికి చెందిన రావిపాటి పద్మావతి(55) ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందింది.

గుండెపోటుతో భక్తురాలు మృతి

పెనుగంచిప్రోలు, జూలై 19 (ఆంధ్రజ్యోతి): తిరుపతమ్మ దేవస్థానం సత్రాల వద్ద మద్దిపాడు మండలంలోని బూరేపల్లికి చెందిన రావిపాటి పద్మావతి(55) ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందింది. సేకరించిన సమాచారం ప్రకారం.. ప ద్మావతి కుటుంబ సభ్యులు కొంతమంది బంధువులతో కలిసి తిరుపతమ్మకి ముడుపుల్ని చెల్లించుకునేందుకు శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత అమ్మవారి సత్రాల వద్దకు వచ్చారు. సత్రాల్లో రాత్రి నిద్రచేశారు. ఆదివారం ఉదయం కుటుంబసభ్యులు స్నానాలు చేసేందుకు బయలుదేరుతుండగా రావిపాటి పద్మ గుండెపోటుతో మృతి చెందింది. పోలీసులు కుటుంబ సభ్యుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పద్మావతి మృతి పట్ల తమకు ఎలాంటి అనుమానాలు లేవని కుటుంబసభ్యులు చెప్పడంతో కేసు నమోదు చేయలేదని ఎస్‌ఐ ఎంఎస్కే.అర్జున తెలిపారు. మొక్కుబడి చెల్లించుకునేందుకు వచ్చిన తమకు ఈ సంఘటన దురదృష్టకరమని మృతురాలి బంధువులు రోదిస్తున్నారు.

Updated Date - Jul 19 , 2026 | 11:35 PM