వేగంగా రికార్డుల విభజన
ABN , Publish Date - Jan 18 , 2026 | 02:43 AM
కొత్తగా ఏర్పాటు చేసిన మార్కాపురం జిల్లాకు సంబంధించిన రికార్డులను అప్పగించే చర్యలు వేగవం తమయ్యాయి. గతనెల 31వతేదీన మార్కాపురం జిల్లా ప్రారంభం కాగా ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు అక్కడ ఇన్‌చార్జి కలెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
నూతన జిల్లాకు అప్పగించేందుకు ముమ్మర చర్యలు
రెవెన్యూ రికార్డులను స్కాన్ చేస్తున్న ఉద్యోగులు
త్వరలోనే మార్కాపురానికి పంపే విధంగా ఏర్పాట్లు
ఒంగోలు కలెక్టరేట్, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): కొత్తగా ఏర్పాటు చేసిన మార్కాపురం జిల్లాకు సంబంధించిన రికార్డులను అప్పగించే చర్యలు వేగవం తమయ్యాయి. గతనెల 31వతేదీన మార్కాపురం జిల్లా ప్రారంభం కాగా ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు అక్కడ ఇన్‌చార్జి కలెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. మార్కా పురం జిల్లా పరిధిలో కనిగిరి, మార్కాపురం, వైపాలెం, గిద్దలూరు నియోజక వర్గాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన అన్ని రికార్డులను ఆ జిల్లాకు అప్పగించనున్నారు. అందుకు సంబంధించి ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకున్నారు. ముందుగా రికార్డులను స్కానింగ్ చేయిస్తున్నారు. ఆ ప్రక్రియలో ఉద్యోగులు నిమగ్నమయ్యారు. ఇది పూర్తయిన తర్వాత రికార్డులతోపాటు స్కానింగ్ చేసిన పత్రాలను కూడా మార్కాపురానికి పంపనున్నారు. రికార్డుల విభజనను డీఆర్వో చినఓబులేశు శనివారం పరిశీలించారు. సంబంధిత సెక్షన్‌ల సూపరింటెండెంట్‌లకు పలు సూచనలు చేశారు.