Share News

419మందికి కంటి పరీక్షలు

ABN , Publish Date - May 17 , 2026 | 11:29 PM

పట్టణంలో బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో శంకర కంటి ఆసుపత్రి, జిల్లా అంధత్వ నివారణ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత ఉంటి వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆదివారం ప్రారంభించారు.

419మందికి కంటి పరీక్షలు
వైద్య శిబిరాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కందుల

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కందుల

పొదిలి, మే 17 (ఆంధ్రజ్యోతి) : పట్టణంలో బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో శంకర కంటి ఆసుపత్రి, జిల్లా అంధత్వ నివారణ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత ఉంటి వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆదివారం ప్రారంభించారు. శిబిరంలో సుమారు 419 మందికి ఉచితంగా కంటి పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందన్నారు. పేదలు ఆరోగ్యంగా ఉండాలన్నదే సీఎం చంద్రబాబు ధ్యేయమన్నారు. 156 మందికి ఆపరేషన్‌లు అవసరమని వైద్యులు నిర్ధారించారు. ఎలాంటి ఖర్చులు లేకుండా ఆపరేషన్‌ చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - May 17 , 2026 | 11:29 PM