ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన
ABN , Publish Date - Mar 21 , 2026 | 10:37 PM
ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో జననీ చారిటబుల్ ట్రస్ట్ , జిల్లా అంధత్వ నివారణ సంస్థ, శంకర కంటి ఆసుపత్రి సహకారంతో జరిగిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరానికి శనివారం విశేష స్పందన లభించింది.
134 మంది కంటి వైద్య పరీక్షలు
కనిగిరి, మార్చి 21 (ఆంధ్రజ్యోతి) : ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో జననీ చారిటబుల్ ట్రస్ట్ , జిల్లా అంధత్వ నివారణ సంస్థ, శంకర కంటి ఆసుపత్రి సహకారంతో జరిగిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరానికి శనివారం విశేష స్పందన లభించింది. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో జరిగిన ఉచిత వైద్య శిబిరంలో శంకర కంటి వైదు బృందం 134 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో 79 మందికి శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు గుర్తించగా, వారిలో ఇద్దరు కంటి ఆపరేషన్‌కు వీలుకాని వారిగా గుర్తించారు. మిగతా 77 మందిని విడతల వారీగా గుంటూరు పెదకాకానిలోని శంకర కంటి ఆసుపత్రికి తరలించనున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు తెలిపాయి. వారిలో తొలివిడతగా శనివారం 47 మందిని గుంటూరుకు తరలించారు. రెండవ విడతగా మిగతా 30 మందిని ఈనెల 23వ తేదీన తరలించనున్నట్లు తెలిపారు. వైద్య పరిక్షలు నిర్వహించిన వారిలో శంకర కంటి వైద్య నిపుణులు డాక్టర్ యజ్ఞశ్రీ వైద్య శిబిరంలో తెలుగు మహిళలు విశేష సేవలందించారు. వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర సలందర్శించి కంటి సంబంధ బాధితులను పరామర్శించారు. ప్రత్యేక గదిలో వైద్య పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. వైద్య శిబిరానికి వచ్చిన వారికి భోజన వసతి కల్పించారు.