వివాహేతర సంబంధం.. వృద్ధుడి హత్య
ABN , Publish Date - Aug 05 , 2026 | 12:04 AM
తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, తమ తల్లితండ్రులు విడిపోవడానికి కారకుడని ఓ వృద్ధుడిని యువకుడు కత్తితో నరికి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఉలవపాడు మండలం చాగల్లు ఎస్సీ కాలనీలో మంగళవారం చోటు చేసుకుంది.
ఉలవపాడు, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, తమ తల్లితండ్రులు విడిపోవడానికి కారకుడని ఓ వృద్ధుడిని యువకుడు కత్తితో నరికి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఉలవపాడు మండలం చాగల్లు ఎస్సీ కాలనీలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం.. ప్రకారం చాగొల్లు ఎస్సీ కాలనీకి చెందిన మెండా కోటయ్య(64) అదే కాలనీకి చెందిన ఓ మహిళతో 15 ఏళ్ల క్రితం వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వివాహేతర సంబంధం బహిర్గతం కావడంతో ఆ మహిళ భర్త మరో వివాహం చేసుకున్నాడు. దీంతో ఆ మహిళ తన కుమారుడు అభిలాష్ వద్దే ఉంటోంది. ఈ నేపథ్యంలో అభిలాష్ ఉదోగ్య రీత్యా హైదరాబాద్‌కు వెళ్లాడు. మహిళ తమ స్వగ్రామం కరేడులో ఉంటుంది. తమ తల్లితండ్రులు విడిపోవడానికి కోటయ్య కారణమని అభిలాష్ ఆయన కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఐదు రోజుల క్రితం అభిలాష్ తండ్రి బ్రైన్‌స్ట్రోక్‌తో మృతి చెందాడు. దీంతో అభిలాష్ తమ స్వగ్రామానికి వచ్చాడు. తండ్రి మరణానికి, తల్లితండ్రులు విడిపోవడానికి కోటయ్యే కారణమని మనసులో పెట్టుకున్న అభిలాష్ ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న కోటయ్యను కత్తితో విచక్షణారహితంగా నరికి హత్య చేశాడు. సమాచారం అందుకున్న కందుకూరు సీఐ అన్వర్‌బాషా, ఉలవపాడు సుబ్బారావు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని ఉలవపాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.