Share News

పది పరీక్షలకు సర్వం సిద్ధం

ABN , Publish Date - Mar 16 , 2026 | 12:17 AM

పదవతరగతి పబ్లిక్‌ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. నేటి నుండి పరీక్షలు నిర్వహించే విధంగా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.

పది పరీక్షలకు సర్వం సిద్ధం

ర్చూరు, మార్చి 15 (ఆంధ్రజ్యోతి) : పదవతరగతి పబ్లిక్‌ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. నేటి నుండి పరీక్షలు నిర్వహించే విధంగా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పరీక్షా పత్రాలు పోలీసుస్టేషన్‌కు చేరాయి. పర్చూరు మండల పరిధిలో మొత్తం 643 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు ఎంఈవోలు శివకోటేశ్వరరావు, వెంకట్రామయ్యలు తెలిపారు. దీనికి సంబంధించి పర్చూరులోని ఎస్‌ఎఫ్‌ ఎస్‌ ఇంగ్లీష్‌ మీడియంస్కూల్‌, ఆక్స్‌ఫర్డ్‌ స్కూల్‌, అన్నం బొట్లంవారిపాలెం జిల్లా పరిఽషత్‌ హైస్కూల్‌లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్ష జరుగుతుందన్నారు.

సర్వత్రా చర్చానీయాంశంగా వైఆర్‌హైస్కూల్‌...

కొన్ని దశబ్ధాల నుంచి పర్చూరులోని ఎయిడెడ్‌ వైఆర్‌ హైస్కూల్‌ పదిపరీక్షలకు కేంద్రంగా ఉంది. అయితే ఈ ఏడాది కేవలం ప్రైవేటు పాఠశాలల్లో పది పరీక్షలు నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేశారు. దీంతో సర్వత్రా చర్చానీయాంశంగా మారింది. పూర్తిస్ధాయి వసతులు ఉన్న ఎయిడెట్‌ పాఠశాలను విస్మరించి ప్రైవేటు పాఠశాలలో పరీక్షలు ఏర్పాటు చేయటం ఏమిటని విద్యార్థుల తల్లిదండ్రులు సైతం విస్మయానికి గురయ్యారు.

నేటి నుంచి పదో తరగతి పరీక్షలు

మార్టూరు : మండలంలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి పబ్లిక్‌ పరీక్షలకు సంబందించి అన్ని ఏర్పాట్లును పూర్తిచేసినట్లు ఎంఈవో వస్రామ్‌నాయక్‌ తెలిపారు. మండలంలో నాలుగు కేంద్రాలు మార్టూరు, వలపర్ల, ద్రోణాదుల జడ్‌పి హైస్కూల్స్‌లలో మార్టూరులోని రాయల్‌ హైస్కూల్‌లో ఏర్పాటు చేశామన్నారు. ఈ నాలుగు కేంద్రాలలో 914 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారన్నారు. 45 మంది ఉపాధ్యాయులు ఇన్విజిలేటర్లుగా వ్యవహరిం చనున్నట్లు తెలిపారు. అదేవిధంగా యద్దనపూడి మండలంలో యద్దనపూడి జడ్పీ హైస్కూల్‌ను పరీక్ష కేంద్రంగా ఎంపికచేశారు. ఈ కేంద్రంలో యద్దనపూడి, జాగర్లమూడి, పూనూరు, గన్నవరం, యద్దనపూడిలోని బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు పరీక్షలకు హాజురుకానున్నారు. పోలూరు జడ్పీ హైస్కూల్‌ విద్యార్థులు అన్నంబొట్లవారిపాలెం జడ్పీ హైస్కూల్‌లో పరీక్షలు రాయనున్నారు.

4 సెంటర్లలో పది పరీక్షలు

ఇంకొల్లు : ఈ నెల 16 నుంచి ఏప్రిల్‌ 1 వరకు జరగనున్న పదవతరగతి పరీక్షలకు అధికారులు సర్వసిద్ధం చేశారు. ఇంకొల్లు మండలంలో 4 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా నివేదిత హైస్కూల్‌, ఎంఆర్‌ఆర్‌ హైస్కూల్‌, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల పూసపాడు అడ్డరోడ్డులోని ఎస్‌కెఏవీఎస్‌ ఉన్నత పాఠశాలలో పరీక్షలు నిర్వహించనున్నారు.ఈ పరీక్షలు మొత్తం 771 మంది విద్యార్థులు రాయనున్నట్లు ఎంఈవో ఏ.శ్రీనివాసరావు తెలిపారు. ప్రశాంత వాతారణంలో విద్యార్ధులు పరీక్షలు విజయవంతంగా రాసుకోవాలని ఆకాంక్షించారు.

పది పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

చినగంజాం : మండలంలో సోమవారం నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మండలంలోని రెండు కేంద్రాల్లో 417 మంది విద్యార్థులు ఈ ఏడాది పరీక్షలు రాయనున్నట్లు ఎంఈవో- బి.అజయ్‌బాబు తెలిపారు. సోమవారం నుండి ఏప్రిల్‌ 1వ తేది వరకు జరిగే పరీక్షలు ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.45 గంటలకు పరీక్షలు జరుగుతా యన్నారు. చినగంజాం, కడవకుదురు జడ్పీ పాఠశాలలోని పరీక్ష కేంద్రాల వద్ద చినగంజాం, సంతరావూరు పీహెచ్‌సీ వైద్యసిబ్బంది అవసరమైన మందులతో సిద్ధంగా ఉంటారని పేర్కొన్నారు. చినగంజాం జడ్పీ ఉన్నత పాఠశాలలో బాలురు 126 మంది, బాలికలు 135 మంది, కడవకుదురు జడ్పీఉన్నత పాఠశాలలో బాలురు 76 మంది, బాలికలు 80 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు. చినగంజాం పరీక్ష కేంద్రంలో 13 మంది ఇన్విజిలేటర్లు, కడవకుదురు పరీక్ష కేంద్రంలో 9 మంది ఇన్విజిలేటర్లను ఇద్దరు చీప్‌ సూప రింటెండెట్స్‌, డిపార్ట్‌మెంట్‌ అధికారులను నియమించి నట్లు వివరించారు. వారిలో ఐదుగురు ప్రైవేట్‌ ఉపాధ్యా యులకు ఈసారి ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. పదో తరగతి పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ అమలో ఉంటుందని, కేంద్రాల సమీపంలో జిరాక్స్‌, ఇంటర్నెట్‌ సెంటర్లు మూసి వేయాలని ఎస్‌.ఐ శీలం రమేష్‌ తెలిపారు.

Updated Date - Mar 16 , 2026 | 12:17 AM