ఊరూరా పండుగ
ABN , Publish Date - Jan 17 , 2026 | 01:19 AM
జిల్లావ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు మూడు రోజులపాటు ఉత్సాహంగా సాగాయి. పలురకాల క్రీడా, సాంస్కృతిక పోటీలు, ఇతర కార్యక్రమాలు జరిగాయి. పెద్దసం ఖ్యలో యువకులు, మహిళలు పాల్గొన్నారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
ఉత్సాహంగా పాల్గొన్న యువత
జోరుగా సాగిన కోడిపందేలు
నియంత్రించలేక పోయిన పోలీసులు
ఎన్‌ఆర్‌ఐల రాకకు ట్రంప్ దెబ్బ
చివరి రోజు తెప్పోత్సవాలు, పార్వేట
తిరుగు ప్రయాణంలో జిల్లావాసులు
జిల్లావ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు మూడు రోజులపాటు ఉత్సాహంగా సాగాయి. పలురకాల క్రీడా, సాంస్కృతిక పోటీలు, ఇతర కార్యక్రమాలు జరిగాయి. పెద్దసం ఖ్యలో యువకులు, మహిళలు పాల్గొన్నారు. మూడో రోజైన శుక్రవారం సాయంత్రం పలుచోట్ల పార్వేటలు, తెప్పోత్సవాలు వైభ వంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా కోడిపందేలు జోరుగా సాగాయి. వాటిని నియంత్రిం చడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు.
ఒంగోలు, జనవరి 16(ఆంధ్రజ్యోతి) : సంక్రాంతి సంబరాలు మూడు రోజులు ఘనంగా జరిగాయి. పల్లె మొదలు నగరాల వరకు సందడి వాతావరణం నెల కొంది. పలు సాంస్కృతిక కార్యక్రమాలలో యువత ఉత్సాహంగా పాల్గొని సందడి చేసింది. పండుగకు రెండు, మూడు రోజులు ముందు నుంచే జిల్లాలోని పలుచోట్ల ముగ్గులు, క్రికెట్, కబడ్డీ ఇతరత్రా పోటీలు ప్రారంభమయ్యాయి. పండుగ రోజుల్లో మరింత అధికంగా జరిగాయి. చాలాచోట్ల ఎడ్లపందేలను నిర్వహించారు. ఉలిచిలో పొట్టేళ్ల పందేలు జరిగాయి. జిల్లాలోని సుమారు రెండు వందలకుపైగా గ్రామాల్లో ఇలా క్రీడలు, ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినట్లు సమాచారం. చిన్నపెద్ద దేవాలయాలు అన్నింటిలోనూ భక్తులు పెద్దఎత్తున పూజలు చేశారు. కనుమ సందర్భంగా తెప్పోత్సవాలు భారీగానే జరిగాయి. శుక్రవారం రాత్రి ఒంగోలులో నిర్వహించిన తెప్పోత్సవంలో ఎంపీ మాగుంట శ్రీనివాసు లరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. మరోవైపు సంక్రాంతికి సాధారణంగా వచ్చే ఎన్‌ఆర్‌ఐలు ప్రత్యేకించి అమెరికాలో ఉద్యోగాలు చేసుకు నే జిల్లావాసులు ఈసారి పెద్దగా రాలేకపోయారు. ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ విధానాలు వారి రాకపోకలకు ప్రతి బంధకంగా మారడంతో చాలామంది ఆగిపోయారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలలో ఉద్యోగ, వ్యాపార, ఇతరత్రా వృత్తుల్లో ఉన్న జిల్లావాసులు పెద్ద సంఖ్యలోనే పండుగకు సొంతూళ్లకు వచ్చారు. అలాంటి వారంతా తిరిగి తాము నివసిస్తున్న ప్రాంతాలకు బయల్దేరారు.