Share News

ప్రమాదమని తెలిసినా.. వీడని నిర్లక్ష్యం

ABN , Publish Date - Jan 20 , 2026 | 12:25 AM

పట్టణంలో పారిశుధ్య నిర్వహణకు పలువురు స్థానికులు నుంచి సహకారం కొరవడుతోంది.

ప్రమాదమని తెలిసినా.. వీడని నిర్లక్ష్యం

వేటపాలెం(చీరాల), జనవరి19 (ఆంధ్ర జ్యోతి) : పట్టణంలో పారిశుధ్య నిర్వహణకు పలువురు స్థానికులు నుంచి సహకారం కొరవడుతోంది. పలుచోట్ల విద్యుత్‌ ట్రాన్స్‌ ఫార్మర్ల వెంబడే చెత్త వేస్తున్నారు. నివాసాల్లో చెత్తను తీసుకువచ్చి వీధుల్లోని విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు ఒడిల్లోనే వేసు ్తన్నారు. వీటికి తోడు నివాసాల్లో వ్యర్థ జలాలు కూడా ఇక్కడికే వచ్చి చేరుతున్నాయి. దీంతో నేల తేమబారి ప్రమాదభరితంగా మారు తోంది. ఇక్కడ చెత్త తొలగించాలంటేనే పలువురు కార్మికులు ఆందోళన చెందుతు న్నారు. ఒకవైపు విద్యుత్‌శాఖ అధికారులు కూడా ఆ శాఖ కు సంబంధిం చిన ప్రదేశాల్లో రక్షణ చర్యలు చేపట్టడం లేదు. మరొక వైపు ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహ రించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రాణహానీ ప్రమాదాలు జరుగుతా యని కార్మికులు కలత చెందుతు న్నారు. వేటపాలెంల కన్యకా పరమేశ్వరి వీధిలో, మార్కెట్‌ సెంటర్‌లో, అలాగే పట్టణంలో కూడా పలుచోట్ల ఈ తరహా సంఘటనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో అధికారులు జాగ్రత్త చర్యలు చేపట్టా ల్సి ఉంది. అసలే అంతంత మాత్రంగానే చెత్త సేకరణ చేస్తున్నారు. ఇది అలుసుగా చేసుకుని మరికొందరు కార్మికులు కొన్నిచోట్ల పారిశుధ్య నిర్వహణలో పారదర్శకత పాటించడం లేదు. దీంతో దోమలు భీభత్సం సృష్టిస్తున్నాయి.

Updated Date - Jan 20 , 2026 | 12:25 AM