Share News

విషాదంలోనూ పరీక్షకు..

ABN , Publish Date - Mar 03 , 2026 | 01:51 AM

ఇంట్లో కళ్ల ఎదుట అనారోగ్యంతో మృతిచెందిన తల్లి మృతదేహం.. మరోవైపు ఇంటర్‌ పరీక్ష.. పొంగి వస్తున్న దుఃఖాన్ని అదుపు చేసుకుంటూ గుండె నిబ్బరంతో ఇంటర్‌ పరీక్ష రాసిన అనంతరం తల్లి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు ఆ విద్యార్థి. ఈ విషాదకర ఘటన సోమవారం పంగులూరు మండలంలోని అలవలపాడులో చోటుచేసుకుంది.

విషాదంలోనూ పరీక్షకు..

ఇంట్లో తల్లి మృతదేహం

దుఃఖాన్ని దిగమింగి ఇంటర్‌ పరీక్ష రాసిన విద్యార్థి

అనంతరం అంత్యక్రియలకు హాజరు

పంగులూరు, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి) : ఇంట్లో కళ్ల ఎదుట అనారోగ్యంతో మృతిచెందిన తల్లి మృతదేహం.. మరోవైపు ఇంటర్‌ పరీక్ష.. పొంగి వస్తున్న దుఃఖాన్ని అదుపు చేసుకుంటూ గుండె నిబ్బరంతో ఇంటర్‌ పరీక్ష రాసిన అనంతరం తల్లి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు ఆ విద్యార్థి. ఈ విషాదకర ఘటన సోమవారం పంగులూరు మండలంలోని అలవలపాడులో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కాకర్లమూడి ఆదాం, సుజాత దంపతులకు ముగ్గురు సంతానం. ఆదాం ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తు న్నాడు. పెద్దకుమార్తె లక్ష్మి డిగ్రీ, కుమారుడు ప్రేమ్‌కుమార్‌ అద్దంకిలోని ప్రైవేట్‌ కళాశాలలో జూని యర్‌ ఇంటర్‌ చదువుతున్నాడు. మూడో సంతానం విజయకుమార్‌ 7వతరగతి చదువుతున్నాడు. ఆదాం భార్య సుజాత కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్సపొందుతోంది. కొద్దిరోజుల క్రితం వ్యాధి తీవ్రత పెరగడంతో మెరుగైన చికిత్స కోసం రాయవేలూరు తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ ఆదివారం ఉదయం మరణించగా మృతదేహాన్ని సాయంత్రానికి అలవలపాడుకు తీసుకొచ్చారు. తల్లి మృతదేహం చూసి కలత చెందిన ప్రేమ్‌కుమార్‌ దుఃఖాన్ని దిగమింగుకుని సోమవారం అద్దంకిలో ఇంటర్‌ పరీక్ష రాసిన అనంతరం విషన్న వదనంతో కుటుంబసభ్యులతో కలసి తల్లి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు.పంగులూరు, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి) : ఇంట్లో కళ్ల ఎదుట అనారోగ్యంతో మృతిచెందిన తల్లి మృతదేహం.. మరోవైపు ఇంటర్‌ పరీక్ష.. పొంగి వస్తున్న దుఃఖాన్ని అదుపు చేసుకుంటూ గుండె నిబ్బరంతో ఇంటర్‌ పరీక్ష రాసిన అనంతరం తల్లి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు ఆ విద్యార్థి. ఈ విషాదకర ఘటన సోమవారం పంగులూరు మండలంలోని అలవలపాడులో చోటుచేసుకుంది. గ్రామా నికి చెందిన కాకర్లమూడి ఆదాం, సుజాత దంపతులకు ముగ్గురు సంతానం. ఆదాం ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తు న్నాడు. పెద్దకుమార్తె లక్ష్మి డిగ్రీ, కుమారుడు ప్రేమ్‌కుమార్‌ అద్దంకిలోని ప్రైవేట్‌ కళాశాలలో జూని యర్‌ ఇంటర్‌ చదువుతున్నాడు. మూడో సంతానం విజయకుమార్‌ 7వతరగతి చదువుతున్నాడు. ఆదాం

Updated Date - Mar 03 , 2026 | 01:51 AM