లీడర్‌షిప్ కాన్‌క్లేవ్ ఉత్సాహం
ABN , Publish Date - Sep 08 , 2026 | 02:57 AM
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లీడర్ షిప్ ట్రైనింగ్ కాన్‌క్లేవ్‌కు ఉమ్మడి జిల్లాకు చెందిన కీలక నేతలు హాజరయ్యారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమ, మంగళవారాల్లో ఈ ప్రత్యేక శిక్షణ సదస్సును ఏర్పాటు చేశారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రత్యేక దృష్టిసారించి దీనిని నిర్వహించారు.
హాజరైన జిల్లాకు చెందిన కీలక నేతలు
పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలు.. స్థానిక
ఎన్నికలపై చంద్రబాబు దిశానిర్దేశం
వెలిగొండ అంశాన్ని ప్రస్తావిస్తూ ఆనందపడిన సీఎం
ఒంగోలు, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లీడర్ షిప్ ట్రైనింగ్ కాన్‌క్లేవ్‌కు ఉమ్మడి జిల్లాకు చెందిన కీలక నేతలు హాజరయ్యారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమ, మంగళవారాల్లో ఈ ప్రత్యేక శిక్షణ సదస్సును ఏర్పాటు చేశారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రత్యేక దృష్టిసారించి దీనిని నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ రాష్ట్ర, జాతీయ బాధ్యతల్లో ఉన్న వారు హాజరయ్యారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అబివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, సమస్యల పరిష్కారం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, వైసీపీ ఫేక్ ప్రచారాలను తిప్పికొట్టడం, స్వర్ణాంధ్ర విజన్-47 లక్ష్యసాధన, ప్రభుత్వం, పార్టీ యంత్రాంగం మధ్య మరింత సమన్వయం వంటి అంశాలు, వాటి లక్ష్యసాధనలో కీలక నేతలు మరింత క్రియాశీలకంగా వ్యవహరించేలా చేయడం ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం. సోమవారం ఆయా అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ కీలక నేతలకు దిశానిర్దేశం చేశారు. సీఎం ప్రసంగించే సమయంలో ఇటీవల వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ విషయాన్ని ప్రస్తావించి ఆ సందర్భంగా మార్కాపురం జిల్లా ప్రజల్లో కనిపించిన ఆనందోత్సాహాలు తనకు ఎంతో సంతృప్తినిచ్చా యని ఆనందంగా చెప్పారు. అదే సమయంలో వెలిగొండ ప్రారంభం, అనకాపల్లికి పోలవరం నీటి విడుదల నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో సీఈవో సీఎం టూ వాటర్‌మెన్ అన్న శీర్షికతో ప్రచురితమైన కథనాన్ని జలవననరుల మంత్రి నిమ్మల రామానాయుడు ప్రస్తావించగా ఉమ్మడి జిల్లా నేతలు సీఎంకు అభినందనలు తెలిపారు. కాగా ఈసమావేశానికి రెండు జిల్లాలకు చెందిన మంత్రులు డాక్టర్ డీఎస్‌బీవీ స్వామి, గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బీఎన్ విజయ్‌కుమార్, ఇంటూరి నాగేశ్వరరావు, డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి, కందుల నారాయణరెడ్డి, ఎం.అశోక్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జిలు గొట్టిపాటి లక్ష్మి, ఎరిక్షన్‌బాబు, ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, కార్పొరేషన్ చైర్మన్లు దామచర్ల సత్య, నూకసాని బాలాజీ వంటి ముఖ్యనేతలు హాజరయ్యారు.