Share News

ఈ నెలాఖరు..

ABN , Publish Date - Mar 26 , 2026 | 02:26 AM

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇంటి పన్నుల వసూలుకు ఈ నెలాఖరు వరకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. నూరుశాతం రాబట్టాలని పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్‌ ఆదేశాలు జారీచేశారు.

ఈ నెలాఖరు..

ఇంటి పన్నుల వసూళ్లకు అవకాశం

ఉమ్మడి జిల్లాలో రూ.16.24 కోట్లు పెండింగ్‌

రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకొని వసూలు చేయాలని పీఆర్‌ కమిషనర్‌ ఆదేశం

క్షేత్రస్థాయిలో కదిలిన అధికారులు

ఒంగోలు కలెక్టరేట్‌, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇంటి పన్నుల వసూలుకు ఈ నెలాఖరు వరకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. నూరుశాతం రాబట్టాలని పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్‌ ఆదేశాలు జారీచేశారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం రూ.52 కోట్లను వసూలు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.35.76 కోట్లు వచ్చాయి. ఇంకా రూ.16.24 కోట్లు పెండింగ్‌లో ఉంది. మరో వారంరోజులు గడువు ఉన్నందున రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకొని ఆయా పంచాయతీల్లో ఇంటి పన్నుల వసూలుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ ఆదేశించడంతో డీపీవో ఎం.వెంకటేశ్వరరావు నేతృత్వంలో డివిజనల్‌ పంచాయతీ అధికారులు, డీఎల్‌డీవోలు, క్షేత్రస్థాయిలో ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు రంగంలోకి దిగారు. అధికంగా పెండింగ్‌లో ఉన్న పంచాయతీల్లో నూరుశాతం పన్నుల వసూలుకు చర్యలు తీసుకుంటున్నారు. మరో ఏడు రోజులు మాత్రమే సమయం ఉండటంతో రోజుకు సుమారు రూ.2 కోట్లకుపైన వసూలు చేయాల్సి ఉంది. దీంతో ఎక్కువ మొత్తంలో పెండింగ్‌లో ఉన్న మండలాల్లో నేతల సహకారాన్ని తీసుకొని వసూలుకు ఉపక్రమించారు.

Updated Date - Mar 26 , 2026 | 02:26 AM