Share News

కౌశలంతో ఉపాధి

ABN , Publish Date - Aug 27 , 2026 | 03:27 AM

రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిం దని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. కౌశలం ద్వారా స్వర్ణ వార్డు, గ్రామ శాఖ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి అర్హతకు అనుగుణంగా ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు.

కౌశలంతో ఉపాధి
కౌశలం జాబ్‌మేళాలో మాట్లాడుతున్న మంత్రి స్వామి, పక్కన ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర, కలెక్టర్‌ రాజాబాబు

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కల్పనకు ప్రభుత్వం చర్యలు

స్వర్ణ వార్డు, గ్రామ శాఖ ద్వారా పథకం అమలు

ఒంగోలులో స్కిల్‌ సెంటర్‌ ఏర్పాటుకు చర్యలు

మంత్రి డాక్టర్‌ శ్రీబాలవీరాంజనేయస్వామి

ఒంగోలు కలెక్టరేట్‌, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిం దని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. కౌశలం ద్వారా స్వర్ణ వార్డు, గ్రామ శాఖ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి అర్హతకు అనుగుణంగా ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. కలెక్టరేట్‌లోని మీకోసం హాలులో ఆదివారం స్వర్ణగ్రామ, వార్డు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కౌశలం జాబ్‌మేళాలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 21లక్షల మందికి ఉపాధి కల్పన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. కౌశలం ద్వారా ఇప్పటి వరకు పదివేల మందికి ఉపాధి కల్పించామన్నారు. నిరుద్యోగ యువతీ, యువకులకు రాష్ట్రవ్యాప్తంగా 8 చోట్ల స్కిల్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అందులో ఒంగోలు కూడా ఉందన్నారు. ఈ స్కిల్‌ సెంటర్ల ద్వారా యువతకు ఉపాధి అవకాశాలకు అవసరమైన నైపుణ్యాలను అందిస్తామని తెలిపారు బీఎస్సీ నర్సింగ్‌ విద్యార్థులు జర్మనీ, ఇజ్రాయిల్‌ లాంగ్వేజ్‌లో శిక్షణ ఇచ్చి ఆ దేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉపాధ్యాయ, పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టులను కూడా భర్తీ చేసిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గంజాయి, డ్రగ్స్‌తో యువతను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. కలెక్టర్‌ రాజాబాబు మాట్లాడుతూ అందుబాటులోకి వచ్చిన అవకాశాలను యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ మాట్లాడుతూ ఒంగోలులో గ్రీన్‌టెక్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న జాబ్‌ మేళాలో ఎక్కువ మందికి అవకాశం కల్పించేలా చూడాలని కంపెనీ ప్రతినిధులను కోరారు. ఉపాధి పొందిన నిరుద్యోగులు కష్టపడి పనిచేస్తే మరింతగా రాణించవచ్చని తెలిపారు. కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి మాట్లాడుతూ వేతనం తక్కువ అని ఆలోచించకుండా ఉద్యోగంలో చేరితే భవిష్యత్‌లో మంచి స్థానానికి చేరుకుంటారన్నారు. ఆ దిశగా యువత ముందుకు సాగాలన్నారు. స్వర్ణవార్డు, స్వర్ణగ్రామ అధికారి ఎం.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కౌశలం ద్వారా 1,204 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 700 మందికిపైగా పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారన్నారు. వారందరికీ ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. జిల్లాలో ఇంకా జాబ్‌ మేళాలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రీన్‌టెక్‌ కంపెనీ ప్రతినిధులు రాంబాబు, గురుసాయిలు తమ కంపెనీ ద్వారా పొందే ఉద్యోగాలతోపాటు వేతనాలు, ఇతర సౌకర్యాలను వివరించారు. కార్యక్రమంలో ఒడా చైర్మన్‌ షేక్‌ రియాజ్‌, ఏఎంసీ చైర్మన్‌ రాచగొర్ల వెంకట్రావు, డీఆర్వో వెంకటరమణ పాల్గొన్నారు.

Updated Date - Aug 27 , 2026 | 03:27 AM