Share News

జాబ్‌ మేళాతో యువతకు ఉపాధి

ABN , Publish Date - Jun 09 , 2026 | 11:05 PM

నిరుద్యోగ యువతీయువకులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు జాబ్‌ మేళాలను నిర్వహిస్తున్నారని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు.

జాబ్‌ మేళాతో యువతకు ఉపాధి
జాబ్‌ మేళాలో మాట్లాడుతున్న టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు

టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు

ఎర్రగొండపాలెం, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి) : నిరుద్యోగ యువతీయువకులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు జాబ్‌ మేళాలను నిర్వహిస్తున్నారని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. ఎర్రగొండపాలెంలో మంగళవారం జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ, ప్రైవేటు కంపెనీలతో కలసి ఏర్పాటు చేసిన జాబ్‌ మేళాలో ఎరిక్షన్‌బాబు పాల్గొని మాట్లాడారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గక్షంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓబీసీలు ఎక్కువ పేదరికంలో ఉన్నారని తెలిపారు. ఉన్నత చదువులు చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాలు పొందలేని నిరుద్యోగ యువతకు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రైవేటు కంపెనీలతో కలిసి నిర్వహిస్తున్న ఈ జాబ్‌ మేళా పాల్గొని సెలెక్ట్‌ అయి ఉద్యోగాలు పొందాలని ఆకాంక్షించారు. జాబ్‌ మేళాలో 10 ప్రైవేటు కంపెనీలు పాల్గొనగా 93 మంది నిరుద్యోగ యువతి, యువకులు ఇంటర్వ్యూలకు హాజరు కాగా 34 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం.కంచిబాబు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం కంచిబాబు, ఏఎంసీ చైర్మన్‌ చేకూరి సుబ్బారావు, టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు పయ్యావుల ప్రసాదరావు, కాకర్ల కోటయ్య, పుల్లలచెరువు టీడీపీ మండల నాయకులు బీవీ సుబ్బారెడ్డి, మాజీ సర్పంచి కంచర్ల సత్యనారాయణగౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 09 , 2026 | 11:05 PM