Share News

ఉద్యోగుల విభజన వేగవంతం

ABN , Publish Date - Jul 18 , 2026 | 01:54 AM

ఉమ్మడి జిల్లాలో రాష్ట్రపతి ఉత్త ర్వుల మేరకు నూతన జిల్లాల మధ్య ఉద్యో గుల విభజనకు కసరత్తు ప్రారంభమైంది. వచ్చేనెల 5వతేదీలోపు ఈప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో తదనుగుణంగా కలెక్టర్లు చర్యలు చేపట్టారు.

ఉద్యోగుల విభజన వేగవంతం

వచ్చేనెల 5లోపు ప్రక్రియ పూర్తికి ప్రభుత్వ ఆదేశం

త హసీల్దార్లు, డీటీలు సీసీఎల్‌ఏ పరిధిలో బదిలీ

ఇతర కేడర్ల ఉద్యోగులు జిల్లాస్థాయిలోనే విభజన

కమిటీ చైర్మన్‌గా ప్రకాశం కలెక్టర్‌ రాజాబాబు

కోచైర్మన్లుగా మార్కాపురం, బాపట్ల జిల్లాల కలెక్టర్లు

22న ఉద్యోగులు ఆప్షన్లు పెట్టుకునేందుకు అవకాశం

ఒంగోలు కలెక్టరేట్‌, జూలై 17 (ఆంధ్ర జ్యోతి) : ఉమ్మడి జిల్లాలో రాష్ట్రపతి ఉత్త ర్వుల మేరకు నూతన జిల్లాల మధ్య ఉద్యో గుల విభజనకు కసరత్తు ప్రారంభమైంది. వచ్చేనెల 5వతేదీలోపు ఈప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో తదనుగుణంగా కలెక్టర్లు చర్యలు చేపట్టారు. వేగవంతంగా పూర్తిచేసేందుకు సీనియారిటీ జాబితాలను కూడా సిద్ధం చేస్తున్నారు. తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్ల విభజనకు సంబంధించి రాష్ట్రస్థాయిలో వారి సీనియారిటీ జాబితాను సీసీఎల్‌ఏ శని, ఆదివారాల్లో ప్రకటించనుంది. ఆఫీసు సబార్డినేట్లను ఆర్డీవో స్థాయిలో విభజన చేయనున్నారు. ఇతర కేడర్లలోని ఉద్యోగులను కలెక్టర్ల ఆధ్వర్యంలో ఆయా జిల్లాలకు పంప నున్నారు. ప్రస్తుత ప్రకాశం జిల్లాలో ఆరు నియోజకవర్గాలు ఉండగా నూతనంగా ఏర్ప డిన మార్కాపురం జిల్లాలో నాలుగు నియోజ కవర్గాలు ఉన్నాయి. బాపట్ల జిల్లాలోకి రెండు నియోజకవర్గాలు వెళ్లాయి. ఆయా జిల్లాల్లోకి వెళ్ళిన మండలాల ఆధారంగా ఉద్యోగుల విభజన చేయనున్నట్లు సమాచారం.

ఉద్యోగులు ఆప్షన్లు ఇవ్వాలి

జిల్లాస్థాయిలో సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, టైపి స్టులు, వివిధ కేడర్లలోని ఉద్యోగుల విభజన కమిటీకి చైర్మన్‌గా కలెక్టర్‌ రాజాబాబు వ్యవహరించనున్నారు. బాపట్ల, మార్కాపురం జిల్లాల కలెక్టర్లు కో చైర్మన్లుగా, మూడు జిల్లాల డీఆర్వోలు సభ్యులుగా ఉంటారు. మరోవైపు విభజనకు ముందే ఉద్యోగులు ఏ జిల్లాలో పనిచేయాలని అనుకుంటున్నారన్న దానిపై ఈనెల 22వతేదీన ఆప్షన్లు తీసుకోను న్నారు. ఆ తర్వాత విభజన చేయనున్నట్లు తెలుస్తోంది. వచ్చేనెల 5వతేదీ నాటికి ప్రక్రియను పూర్తిచేసి ఆయా జిల్లాలకు నియమితులైన ఉద్యోగులందరూ విధుల్లో చేరేవిధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించడంతో తదనుగుణంగా అధికారులు ప్రక్రియను వేగవంతం చేశారు.

Updated Date - Jul 18 , 2026 | 01:54 AM