ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Jul 02 , 2026 | 11:03 PM
ఉద్యోగుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ 11వేల మందికి ఓపీఎస్ లబ్ధి చేకూర్చడం ప్రజా ప్రభుత్వం ఉద్యోగుల పట్ల చిత్తశుద్ధిని మరోసారి రుజువు చేసిందని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి చెప్పారు.
11వేల మందికి ఓపీఎస్ లబ్ధి చేకూర్చిన ఘనత సీఎం చంద్రబాబుదే
ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి
కనిగిరి, జూలై 1 (ఆంధ్రజ్యోతి) : ఉద్యోగుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ 11వేల మందికి ఓపీఎస్ లబ్ధి చేకూర్చడం ప్రజా ప్రభుత్వం ఉద్యోగుల పట్ల చిత్తశుద్ధిని మరోసారి రుజువు చేసిందని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి చెప్పారు. సీపీఎస్ ఉద్యోగులను ఓపీఎ్‌సలోకి తీసుకుంటూ సీఎం చంద్రబాబు తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయానికి ఉద్యోగవర్గాల్లో హర్హాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో గురువారం రాత్రి ఉద్యోగులు సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగులు తరలివచ్చి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డిని సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా కేకును కట్ చేశారు. ‘థాంక్యూ సీఎం సార్’ అంటూ ఉద్యోగులు నినాదాలు మిన్నంటాయి.