Share News

సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

ABN , Publish Date - Jun 20 , 2026 | 02:44 AM

గిద్దలూరు మండలం కృష్టంశెట్టిపల్లె (కేఎస్‌ పల్లె) గ్రామంలో ఈనెల 27వతేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటించనున్నారు. ఆరోజు అక్కడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవిని డిజిటల్‌ సర్వ్‌ను ప్రారంభించనున్నారు.

సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
సీఎం పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్‌, ఎస్పీలతో చర్చిస్తున్న ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

27న కృష్టంశెట్టిపల్లికి చంద్రబాబు

పరిశీలించిన కలెక్టర్‌ విజయసునీత, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

గిద్దలూరు టౌన్‌, జూన్‌ 19 (ఆంధ్ర జ్యోతి) : గిద్దలూరు మండలం కృష్టంశెట్టిపల్లె (కేఎస్‌ పల్లె) గ్రామంలో ఈనెల 27వతేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటించనున్నారు. ఆరోజు అక్కడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవిని డిజిటల్‌ సర్వ్‌ను ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్‌ ఎం.విజయసునీత, ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు, ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి గ్రామానికి చేరుకుని ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలతోపాటు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఎమ్మెల్యే ముత్తుముల.. కలెక్టర్‌, ఎస్పీతో చర్చించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ పి.శ్రీనివాసులు, ఆర్డీవో వెంకటశివరామిరెడ్డి, డీఎస్పీ యు.నాగరాజుతోపాటు స్థానిక అర్భన్‌, రూరల్‌ సీఐలు ఎ.సురేష్‌, రామకోటయ్య, తహసీల్దార్‌ ఆంజనేయరెడ్డి, ఎంపీడీవో సీతారామయ్య, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jun 20 , 2026 | 02:44 AM