Share News

రైతులకు న్యాయం జరిగేలా కృషి

ABN , Publish Date - Apr 09 , 2026 | 12:03 AM

:గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణంలో భూములు కోల్పోయి రెమ్యూనరేషన్‌ అందుకోని రైతులకు న్యాయం జరిగేలా ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వాలని ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్‌ తహసీల్దార్‌ సింగారావును ఆదేశించారు. బాపట్ల పార్లమెంట్‌ సభ్యుడు తెన్నేటి కృష్ణప్రసాద్‌ బుధవారం ముప్పవరం వద్ద (బీకేవీ 544జీ) గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణ పనుల ప్రగతిని పరిశీలించారు.

రైతులకు న్యాయం జరిగేలా కృషి
ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్‌కు సమస్యను వివరిస్తున్న బీకేవీ రహదారిలో భూములు కోల్పోయిన జేవీపాలెం రైతులు

పంగులూరు, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి):గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణంలో భూములు కోల్పోయి రెమ్యూనరేషన్‌ అందుకోని రైతులకు న్యాయం జరిగేలా ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వాలని ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్‌ తహసీల్దార్‌ సింగారావును ఆదేశించారు. బాపట్ల పార్లమెంట్‌ సభ్యుడు తెన్నేటి కృష్ణప్రసాద్‌ బుధవారం ముప్పవరం వద్ద (బీకేవీ 544జీ) గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణ పనుల ప్రగతిని పరిశీలించారు. 16వ నెంబరు జాతీయరహదారి నుంచి పడమటివైపునకు మెగా ఇంజనీరింగ్‌ సంస్థ నిర్మిస్తున్న నిర్మాణ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పంగులూరు మండల పరిధిలో 3.4 కిలోమీటర్లలో గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మాణం జరుగుతున్నట్లు తహసీల్దార్‌ సింగారావు ఎంపీకి వివరించారు. ఫేజ్‌-2లో రోడ్డు నిర్మాణంలో భూమి కోల్పోయిన జాగర్లమూడి మంగమ్మ, నాగేశ్వరరావుతో పాటు మరికొందరు రైతులు తగిన నష్టపరిహారం ఇప్పించాలని ఎంపీని కోరారు. ఈ విషయమై పూర్తి వివరాలతో ఉన్నతాధికారులకు నివేదిక అందజేయాలని ఎంపీ కృష్ణప్రసాద్‌ తహసీల్దార్‌ను ఆదేశించారు. ముప్పవరం ఫ్లైఓవర్‌ దక్షిణంవైపు దిగువన 16వ నెంబరు జాతీయరహదారికి తూర్పు వైపు పొలాలకు వెళ్లేందుకు సర్వీస్‌ రోడ్డు నిర్మించాలని రైతులు కోరారు. కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ అధికారులు, మెగాసంస్థ ప్రతినిధులు, గరిమిడి జగన్‌, జేవీపాలెం, ముప్పవరం రైతులు పాల్గొన్నారు.

Updated Date - Apr 09 , 2026 | 12:03 AM