పీ4తో పేదల్లో ఆర్థిక సమానత్వం
ABN , Publish Date - Mar 31 , 2026 | 12:05 AM
ప్రతి కుటుంబం ఆర్థిక సమానత్వం పొందాలనే లక్ష్యంతో ప్రభుత్వం పీ4 కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి చెప్పారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో సోమవారం పీ4 ప్రథమ వార్షికోత్సవం జరిగింది.
ప్రథమ వార్షికోత్సవ సభలో ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహరెడ్డి
కనిగిరి, మార్చి 30 (ఆంధ్రజ్యోతి) : ప్రతి కుటుంబం ఆర్థిక సమానత్వం పొందాలనే లక్ష్యంతో ప్రభుత్వం పీ4 కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి చెప్పారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో సోమవారం పీ4 ప్రథమ వార్షికోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర మాట్లాడుతూ సమాజంలో ప్రతి కుటుంబం, ప్రతి ఒక్కరూ సమానత్వం పొందేందుకు పీ4 కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్నారు. పేదకుటుంబాలను దత్తత తీసుకుని వారికి ఆర్థిక చేయూత ఇచ్చేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. ఎంతో మంది దాతల సహకారంతో కనిగిరి ప్రభుత్వాసుపత్రి అభివృద్ధికి నోచుకుందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రధాని నరేంద్ర మోదీ వికసిత్‌భారత్, సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర లక్ష్యాల్లో భాగంగా నిర్వహించిన పీ4 కార్యక్రయంలో భాగస్వామ్యం కావాలని కోరారు. అనంతరం మార్గదర్శి పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకటశివరామిరెడ్డి, డీఎల్‌డీవో శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ జయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ పర్వతనేని శ్రీధర్, ఎంపీడీవో అబ్దుల్‌ఖాదర్, ఎఫ్‌ఆర్వో పరమేశ్వరరెడ్డి పాల్గొన్నారు.
పేదలను సంపన్నులుగా చూడాలన్నదే సీఎం లక్ష్యం : అశోక్‌రెడ్డి
గిద్దలూరు టౌన్ : పేదలను సంపన్నులుగా చేయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు బంగారు కుటుంబాలు మార్గదర్శకులు అనే నినాదంతో పి4 కార్యక్రమాన్ని రూపొందించారని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని సివిఎన్ కళ్యాణ మండపం నందు ప్రభుత్వం పేద ప్రజల కోసం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పి4 ప్రథమ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు. విద్య, ఆరోగ్యం, సామాజికాభివృద్ది రంగాలలో మార్గదర్శుల సహకారంతో ఫలితాలు సాధించామన్నారు. పి4 బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములైన అందరికీ అభినందనలు తెలిపారు. పి4 పాలసి పేదరిక నిర్మూలనకు ఒక ప్రజాఉద్యమంగా మార్చే వినూత్న విధానంగా నిలుస్తుందని, ఇది సమాన అభివృద్ది, సామాజిక సమగ్రత చివరి వ్యక్తి వరకు లాభాలు చేరడమే లక్ష్యంగా పెట్టుకుని రూపొందించిందని అన్నారు. కార్యక్రమాన్ని రూపొందించడంలో గిద్దలూరు ప్రాంతానికి చెందిన షేక్ బేపరిమహమ్మద్‌కోజాన్, ఖాశింవలి, షేక్ నాయబ్‌రసూల్, బి.మాధవిలత, ఎన్.శైలజ, జి.శ్రీలతలను అభినందించారు. అనంతరం పి4 పాలసీ ద్వారా ముందుకు వచ్చి వికలాంగులకు ఉచితంగా పరికరాలు అందించిన కేశవమూర్తి, 2 నిరుపేద కుటుంబాలను దత్తత తీసుకున్న ఎం.ఎ.ఒ.రఫిని ఆయన సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమణబాబు, మార్కెట్‌యార్డు చైర్మన్, వైస్‌చైర్మన్లు బైలడుగు బాలయ్య, గోడి ఓబులరెడ్డి, కొమరోలు మండలపార్టీ అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు, సొసైటీ బ్యాంక్ చైర్మన్లు దుత్తా బాలీశ్వరయ్య, ముచ్చుగుంట్ల రామసుబ్బయ్య, పట్టణ పార్టీ అధ్యక్షులు షానేషావలి పాల్గొన్నారు.
పీ4 తోవెలుగులు నింపాలి : కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం టౌన్ : పీ-4 ద్వారా పేద కుటుంబాల్లో వెలుగులు నింపాలని జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత అన్నారు. సౌజన్య ఫంక్షన్‌హాలులో సోమవారం సాయంత్రం పీ-4 మొదటి వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ విజయ సునీత మాట్లాడుతూ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, ఉద్యోగులు, చేతనైనం త సాయం చేసి బంగారు కుంటుంబాలకు అండగా ఉండాలన్నారు. సమాజంలో ఆర్థిక అసమానతలు రూపుమాపేందుకు ప్రభుత్వం పీ-4 కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. మార్కాపురం జిల్లాలో ఇంకా 50 వేల కుటుంబాలు సహాయం కోసం ఎదురుచూస్తున్నాయన్నారు. మార్గదర్శకులు ముందుకు వచ్చి పేద కుటుంబాలను ఆదుకోవాలన్నారు. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ పీ-4 కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు మానస పుత్రిక అన్నారు. ఈ నియోజకవర్గంలో 1,500 కుటుంబాలను దత్తత తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో నిరుపేదలు లేకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని ముం దుకు తీసుకెళ్లాలన్నారు. పీ-4 కార్యక్రమం ద్వారా పేద కుటుంబాలకు సహాయం అందించిన స్వచ్ఛంద సంస్థలను కలెక్టర్ విజయ సునీత, ఎమ్మెల్యే కందుల షీల్డులు, ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించా రు. కార్యక్రమంలో సీపీవో స్వరూపరాణి, ఐసీడీఎస్ ఇన్‌చార్జి పీడీ పద్మావతి, ఆర్డీవో ప్రభాకర్, ఏఎంసీ చైర్మన్ వెంకటరెడ్డి పాల్గొన్నారు.
పేద విద్యార్థుల ఉన్నతికి దాతలు సహకరించాలి : టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు
ఎర్రగొండపాలెం, మార్చి 30 (ఆంధ్రజ్యోతి) : పేద కుటుంబాలను గుర్తించి వారికి అన్ని విధాలా ప్రోత్సహించి, వారి పిల్లల ఉన్నతికి కృషి చేయడమే పీ-4 లక్ష్యమని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. ఎర్రగొండపాలెంలో సోమవారం పీ4 విజయోత్సవ సభను ఎరిక్షన్‌బాబు ప్రారంభించారు. ఎంపీడీవో శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ నియోజకవర్గంలో పీ4లో 16,433 బంగారుకుటుంబాలను గుర్తించారని, 2,457 కుటుంబాలను దత్తత చేసుకున్నప్పటికీ 506 కుటుంబాలనే మార్గదర్శకులు ప్రొత్సాహన్ని ఇచ్చారని అన్నారు. పేద విద్యార్థుల ఉన్నతికి దాతలు సహకరించాలని ఎరిక్షన్‌బాబు కోరారు. పీ4ను మొక్కుబడిగా కాకుండా బాధ్యతగా నిర్వహించాలని ఆయన అధికారులకు సూచించారు. కార్యక్రమంలో నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ ఎంవీ సత్యనారాయణ, ఏఎంసీ చైర్మన్ చేకూరి సుబ్బారావు, ఎంపీడీవో శ్రీనివాసరావు, టీడీపీ మండల అధ్యక్షుడు చిట్యాల వెంగళరెడ్డి, మేకల వలరాజు, నాయకులు శ్రీను, ఐదు మండలాల తహసీలార్లు, ఎంఈవోలు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. పీ4 ముఖ్యమంత్రి లైవ్ పొగ్రాంను వీక్షించారు. ఈ సందర్భంగా స్వచ్ఛ రథాన్ని ఎరిక్షన్‌బాబు ప్రారంభించారు. అనంతరం పీ4 కార్యక్రమాలకు నిర్వహించిన ముస్లిం యూత్ సొసైటీ అధ్యక్షుడు షేక్ ఇస్మాయిల్‌కు, పుల్లలచెరువులో విజయవాహిణి చారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు మేడికొండ శ్రీనివాసరావుకు ఎరిక్షన్‌బాబు ప్రశంసాపత్రాలను ఇచ్చి అభినందించారు.