Share News

ఒంగోలులో భూకంపం

ABN , Publish Date - May 10 , 2026 | 03:02 AM

ఒంగోలు నగరంలో శుక్రవారం రాత్రి స్వల్ప భూకంపం వచ్చింది. స్థాని క సీతారామపురం, శర్మా కాలేజీ, దేవుడు చెరువు ప్రాంతా లలో రెండు సెకన్లపాటు భూమి కంపించింది. ఆయా ప్రాంతాల ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురై ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.

ఒంగోలులో భూకంపం

అర్ధరాత్రి రెండు సెకన్లపాటు ప్రకంపనలు

ఒంగోలు కార్పొరేషన్‌, మే 9 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు నగరంలో శుక్రవారం రాత్రి స్వల్ప భూకంపం వచ్చింది. స్థాని క సీతారామపురం, శర్మా కాలేజీ, దేవుడు చెరువు ప్రాంతా లలో రెండు సెకన్లపాటు భూమి కంపించింది. ఆయా ప్రాంతాల ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురై ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. భూప్రకంపనలు ఎక్కువసేపు లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. స్వల్పంగానే భూమి కంపించడంతో ఎలాంటి ప్రమాదం, నష్టం వాటిల్లలేదు. గడిచిన నాలుగు నెలల్లో నగరంలోని కొండమీద ఉన్న సీతారామపురం తదితర ప్రాంతాలలోనే రెండుసార్లు భూప్రకంపనలు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - May 10 , 2026 | 03:02 AM